Orange Re Release Bookings రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్లో హంగామా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. అయితే మార్చి 25, 26న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఆరెంజ్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నాటి డిజాస్టర్ సినిమాకు ఇప్పుడు వస్తున్న క్రేజ్ చూసి సోషల్ మీడియా షాక్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరెంజ్ సినిమాను ఎన్ని థియేటర్లో వేస్తే అన్ని థియటేర్లు, అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు హైద్రాబాద్ ఏరియాలో మొత్తంగా 54 షోలు వేస్తే.. అందులో 41 షోలు ఫుల్ అయ్యాయి. విజయవాడలో పది షోలు వేస్తే ఎనిమిది షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక గుంటూరు ఏరియాలో పన్నెండు షోలు వేస్తే ఎనిమిది షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. వైజాగ్‌ ఏరియాలో పన్నెండు వేస్తే పదకొండు షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.


రామ్ చరణ్‌ ఫ్యాన్స్ మాత్రం ఇంకా షోలు కావాలని, సరిగ్గా ప్లాన్ చేయడం లేదు అని, మార్చి 25న షోలు ఉంటాయని చెప్పారు గానీ.. సరిగ్గా షోలు వేయలేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక నాగబాబు ముందే ఓ విషయాన్ని క్లియర్‌గా చెప్పాడు. ఈ సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా కూడా అది జనసేనకు విరాళంగా ఇస్తాను అని ప్రకటించాడు. 


ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం ఆరెంజ్ మేనియాలోనే ఉన్నారు. చూస్తుంటే ఇంకో రెండు మూడు రోజులుగా ఆరెంజ్ సినిమాను థియేటర్లో సందడి చేసేలా ఉంది. ఆల్రెడీ థియేటర్లో ధమ్కీ బాగానే ఆడుతోంది. అయితే ఆరెంజ్ సినిమాకు థియేటర్లు దొరకపట్టడ కాస్త కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ మెగా అడ్డా అని మరోసారి నిరూపితమైంది. అక్కడ క్షణాల్లో టికెట్లు క్లోజ్ అయ్యాయి.


Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్


Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook