Ram Charan Praises Vishwak sen in Ori Devuda Pre Release Event: చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దమయింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా 21న రిలీజ్ అవుతుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓమై కడువలే అనే సినిమాను ఈ పేరుతో రీమేక్ చేస్తున్నారు. పివిపి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. ఇక ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోని రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొని సినిమా యూనిట్ కు కృతజ్ఞతలు తెలుపడమే గాక విశ్వక్సేన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. విశ్వక్సేన్ ఆటిట్యూడ్ చూపిస్తాడు, దూకుడు ఎక్కువ, నోటి దురుసు ఉంది అంటూ ఇలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆయనలో ఉన్న ఒక మంచి విషయాన్ని రామ్ చరణ్ బయటపెట్టారు.


అదేమిటంటే విశ్వక్సేన్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా మాట మీద మాత్రమే నిలబడతాడని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో విశ్వక్ సేన్.. పేరు తెలియని వారు ఎవరూ లేదని పేర్కొన్న రాంచరణ్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో విశ్వక్ స్థానం సంపాదించాడని అన్నారు. ఫలక్‌నుమా నుంచి రాజమండ్రి వరకు.. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో  ఫ్యాన్స్ ఉన్నారని అన్నారు.


విశ్వక్సేన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉండవచ్చు కానీ నేను అతని పర్సనాలిటీకి పెద్ద ఫ్యాన్‌ని అని సినిమాలో హీరో కన్నా బయట అతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ అని రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.  అంతేకాక ఈ పర్సనాలిటీని ఇలాగే కంటిన్యూ చేయాలని విశ్వక్ సేన్‌కు రామ్ చరణ్ సూచనలు చేశారు. ‘‘పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ రజినీకాంత్ గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్లందరూ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకేలా భావిస్తారు, ఒక సూపర్ స్టార్‌గా ఉండాలంటే నీ పర్సనాలిటీయే నిన్ను అక్కడకు తీసుకెళ్తుందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.


ఇక ఆ పర్సనాలిటీ నీకు నిండుగా ఉందని విశ్వక్ సేన్‌కు మరిచిపోలేని విధంగా స్పీచ్ ఇచ్చి మంచి బూస్ట్ ఇచ్చారు రామ్ చరణ్. ఇక ఈ దెబ్బతో విశ్వక్సేన్ ఓరి దేవుడా సినిమాతో కూడా హిట్ అందుకునే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓమై కడువులే సినిమాను తెలుగులో ఈ పేరుతో రీమేక్ చేశారు.
Also Read: Maanaadu Remake: మరో గాడ్ ఫాదర్ తరహా ప్రయత్నం చేస్తున్న రవితేజ..మరో కుర్రహీరోను కూడా కలుపుకుని?


Also Read: Pawan Kalyan Tension: ఆర్కే బీచ్ కు పవన్.. నోవొటెల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సంచలనంగా విశాఖ టూర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook