Vishwaksen Arjun Sarja Controversy : విశ్వక్ సేన్ మీద ముందు నుంచీ నెగెటివిటీయే ఉంది. కానీ విశ్వక్ మంచి నటుడు. నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేయగలడు. 24 క్రాఫ్ట్స్ మీద పట్టుంది. మంచి మ్యూజిక్ సెన్స్ కూడా ఉంటుంది. అయితే వాటితో పాటుగా కాస్త నోటి దూల కూడా ఉంటుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. అశోకవనంలో అర్జున కళ్యాణం సమయంలో చేసిన ప్రమోషనల్ వీడియో, టీవీ 9తో జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో విశ్వక్ సేన్‌కు మంచి మద్దతు లభించింది. సినిమా కూడా హిట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే విశ్వక్ సేన్ అంటే కాంట్రవర్సీ అన్నట్టుగా మారిపోయింది. అలాంటి నటుడి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ గెస్టుగా వచ్చాడు. గెస్టుగా రావడమే కాదు.. విశ్వక్ సేన్‌ను ఆకాశానికెత్తేశాడు. మాటిస్తే నిలబడే వాడు.. చిరంజీవి, రజినీకాంత్‌లు కూడా అలాంటి వారే అంటూ ఇలా విశ్వక్ సేన్ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. కమిట్మెంట్ ఉన్న నటుడు, ఒక్కసారి మాటిస్తే.. అది తప్పైనా ఒప్పైనా నిలబడతాడు.. అందుకే విశ్వక్ అంటే ఇష్టమని, అతనికి అభిమానిని అని ఇలా రామ్ చరణ్‌ కాస్త ఓవర్‌గానే చెప్పేశాడు.


ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్‌ చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇప్పుడు దర్శకుడిగా మారి తన కూతురు ఐశ్వర్యను తెలుగులో హీరోయిన్‌గా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఆగిపోయింది. ఈ మేరకు అర్జున్ సర్జా ప్రకటించేశాడు. మీడియాతో తన బాధనంతా వెల్లగక్కుకున్నాడు.


అతను చెప్పిన టైంకు రావడం లేదని, అతని వల్ల షెడ్యూల్స్ క్యాన్సిల్స్ చేసుకోవాల్సి వస్తోందని అర్జున్ తెలిపాడు. రేపు షూటింగ్ అంటే.. ఉదయం నాలుగు గంటలకు ఫోన్ చేసి రాలేనని మెసెజ్ పెడతాడంటూ చెప్పుకొచ్చాడు. సంగీతం, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లో తలదూర్చాడని, విబేధించాడంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.


ఇక విశ్వక్‌తో సినిమా తీయనని, కొత్త హీరోతో కొత్త టైటిల్‌ను రేపు ప్రకటిస్తానని అర్జున్ చెప్పేశాడు. మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా రావడం వృథా అయింది. ఇక రామ్ చరణ్ పొగిడిన పొగడ్తలు కూడా వేస్ట్ అయ్యాయి. మొత్తానికి విశ్వక్ సేన్ కెరీర్ మీద ఇదొక మాయని మచ్చలా ఉండేట్టు కనిపిస్తోంది. మరి వీటిపై విశ్వక్ సేన్ స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.


Also Read : Arjun Vishwaksen Issue : నాడు విశ్వక్ సేన్ చెప్పింది అబద్దమా?.. అర్జున్ ఆవేదన ఇదే


Also Read : ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్.. ఇక వారంతా హ్యాపీ!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook