Arjun Vishwaksen Issue : నాడు విశ్వక్ సేన్ చెప్పింది అబద్దమా?.. అర్జున్ ఆవేదన ఇదే.. జీవితంలో ఇలా చేయలేదట

Arjun Vishwaksen Issue యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా పెట్టి, విశ్వక్ సేన్‌ను హీరోగా తీసుకున్నాడు. ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆగిపోయేలా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 05:15 PM IST
  • చిక్కుల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్
  • మీడియా ముందుకు అర్జున్ సర్జా
  • అసలు విషయం ఏంటంటే?
Arjun Vishwaksen Issue : నాడు విశ్వక్ సేన్ చెప్పింది అబద్దమా?.. అర్జున్ ఆవేదన ఇదే.. జీవితంలో ఇలా చేయలేదట

Arjun Vishwaksen Issue : యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్య, విశ్వక్ సేన్‌లతో సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వచ్చి ప్రారంభించాడు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆగిపోయే స్థితికి వచ్చింది. ఈ సినిమా వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలి వానలా మారేట్టు కనిపిస్తోంది. విశ్వక్ సేన్ ప్రవర్తనతో అర్జున్ విసిగి వేజారినట్టు అనిపిస్తోంది. ఇచ్చిన డేట్స్‌కు రావడం లేదని, ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేడని, షెడ్యూల్ మొత్తం మార్చమని అంటున్నాడట. దీంతో విశ్వక్ సేన్ మీద ఫిలిం చాంబర్‌లో అర్జున్ ఫిర్యాదు చేశాడు.

తాను తన కెరీర్‌లో ఇన్ని సార్లు ఎవ్వరినీ పిలవలేదని అర్జున్ తెగ ఫీలయ్యాడు. అయితే విశ్వక్ సేన్ మాత్రం ఈ చిత్రం గురించి ఓరి దేవుడా ప్రమోషన్స్‌లో బాగానే చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సంగతులు చెప్పేశాడు. ప్రస్తుతం ఓరి దేవుడా సినిమా కోసం బిజీగా తిరుగుతున్నాను అని.. అందుకే కాస్త టైం అడిగానంటూ విశ్వక్ సేన్ చెప్పాడు. అర్జున్ సర్ టైం ఇచ్చాడు.. అందుకే ఆ సెట్‌లోకి కాస్త ఆలస్యంగా వెళ్తాను అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

ఆల్రెడీ తాను లేకుండా కొన్ని సీన్లు కూడా షూట్ చేశారంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అయితే విశ్వక్ సేన్ నాడు మీడియాతో చెప్పిన మాటలకు, నేడు అర్జున్ చెబుతున్న మాటలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. తమ మధ్య అంతా మంచి రిలేషన్ ఉందన్నట్టుగా విశ్వక్ సేన్ చెప్పాడు. కానీ విశ్వక్ మాత్రం పదే పదే డేట్స్ మారుస్తున్నాడు.. ఇచ్చిన కాల్షీట్లలో రావడం లేదంటూ అర్జున్ చెబుతున్నాడు. మొత్తానికి ఈ వివాదం మాత్రం చిలికి చిలికి గాలివానలా మారి.. విశ్వక్ సేన్ మీద పెద్ద మచ్చ పడేలా కనిపిస్తోంది.

అయితే విశ్వక్ సేన్ మాత్రం తన సొంత సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడని, అందుకే ఈ సినిమాకు టైం కేటాయించలేకపోతోన్నట్టుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం ధమ్‌కి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని టాక్. రెండు సార్లు సినిమా షెడ్యూల్స్ రద్దు చేసి నన్ను, నా టీమ్ ను విశ్వక్ అవమానించారు అంటూ అర్జున్ బాధపడ్డాడు. రేపు షూటింగ్ అనగా తెల్లవారు ఝామున 4 గంటలకు మెసేజ్ పెట్టి రాలేనన్నాడు అంటూ విశ్వక్ సేన్ చేసిన వ్యవహారం గురించి చెప్పుకొచ్చాడు. షూటింగ్ కోసం నా టీం అర్థరాత్రి ఎంతో శ్రమించింది అంటూ అర్జున్ పడ్డ బాధలన్నీ బయటపెట్టేశాడు. అనూప్ మ్యూజిక్ , బుర్ర సాయిమాదవ్ డైలాగ్స్ , చంద్రబోస్ పాటల విషయంలోనూ వేలుపెట్టాడన్నట్టుగా చెప్పుకొచ్చాడు. 

విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను అంటూ అసలు విషయాన్ని చెప్పేశాడు. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయను అంటూ తెగేసి చెప్పేశాడు అర్జున్. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తాను అంటూ అర్జున్ మీడియాతో చెప్పేశాడు. మరి అర్జున్ వ్యాఖ్యల మీద విశ్వక్ సేన్ స్పందిస్తాడా? అన్నది అనుమానంగా మారింది.

Also Read : Shah Rukh Khan Twitter : ఫ్యామిలీతో కలిసి ఆ పని చేయడట.. అభిమానులకు షారుఖ్ స్వీట్ రిప్లైలు

Also Read : Kushi Movie Postponed: కొంప ముంచిన సమంత.. ఖుషీ రిలీజ్ లేనట్టే.. బయటపెట్టిన విజయ్ దేవరకొండ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News