RC#15 Pics: వైరల్ అయిన చరణ్ లుక్.. జోడిగా హీరోయిన్ అంజలి
రామ్ చరణ్- శంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా సినిమా అప్డేట్స్ బయటకి వస్తుండగా.. ద్విపాత్రాభినయంలో చరణ్ కనపడబోతున్నాడని.. సీనియర్ చరణ్ కి జోడిగా హీరోయిన్ అంజలి నటించనుందని సమాచారం.
RC#15 Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని ఎంజాయి చేస్తున్నాడు. రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే అటు సోషల్ మీడియాలో ఇటు పబ్లిక్ ఈవెంట్ లలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. హీరో రామ్ చరణ్- తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో RC15 రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే! దీంతో మూవీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో తరచూ ఈ సినిమా నుంచి ఏదొక అప్‌డేట్ బయటకు వస్తూ మూవీపై మరింత ఆసక్తికని పెంచుతుంది. ప్రస్తుతం ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ విభిన్న పాత్రలపై ఆసక్తి ఉన్నట్టు సమాచారం. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పుడు తెరపై మరో హిరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇందులో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్‌కు జోడిగా అంజలి కనిపించబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా కనిపంచనున్నారు. సీనియర్ రామ్ చరణ్‌కు సరసన అంజలి నటిస్తుండగా.. జూనియర్ చరణ్‌తో కియారా రొమాన్స్ చేయనన్నట్లు సమాచారం.
రామ్ చరణ్ పంచెకట్టుతో సైకిల్‌పై వెళ్తూ ఉన్న ఓ లుక్ బయటకు వచ్చింది. ఇది RC15లోని సీనియర్ చరణ్‌కు సంబంధించిన లుక్ అంటూ లీకైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇటీవల రాజమహేంద్రవరంలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వగా.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సినిమా వర్గాలు అంటున్నాయి. అయితే రెండో విడత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్, దుబాయ్‌లో జరగనుందని టాక్.
Also Read: Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్ కోసం కస్టమర్ల తిప్పలు
Also Read: HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook