Ram Charan`s luxury car : రామ్ చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కారు కంపెనీ, ధర ఎంతో తెలుసా
Ram Charan`s luxury car collection : కొత్తరకం కారు వచ్చిందంటే చాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొనేయడంలో కొందరు టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ లంబోర్ఘిని ఊరూస్ మోడల్ లగ్జరీ కారును కొన్నారు.
Ram Charan Special design New Luxury Car: టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు కార్లంటే పిచ్చి. ఇక స్టార్ హీరోలంతా లగ్జరీ కార్లపైనే ఎంతో మక్కువ చూపుతుంటారు. మార్కెట్లోకి కొత్తరకం కారు ఏది వచ్చినా సరే.. వెంటనే దాన్ని కొనేసి రయ్‌మంటూ దూసుకెళ్లాలని తహతహలాడుతుంటారు మన తెలుగు హీరోలు. అందుకే ఫారిన్ కార్లలో (Foreign Cars) బెస్ట్‌గా ఉండేవన్నీ చాలా వరకు మన స్టార్స్ హీరోల ఇంటి ముందు పార్క్ అయి ఉంటాయి. కొత్తరకం కారు వచ్చిందంటే చాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొనేయడంలో కొందరు టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడూ ముందే ఉంటారు.
చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట
ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young tiger NTR) ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ (fox wagon)అనుబంధ సంస్థ లంబోర్ఘిని ఊరూస్ (Lamborghini Urus) మోడల్ లగ్జరీ కారును కొన్నారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒక కొత్త ఫారిన్ కారు కొనేశారు. అంతేకాదండోయ్.. ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారట. ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 (Mercedes Maybach GLS 600). రీసెంట్‌గా ఈ కారు డెలివరి అయ్యింది. చరణ్ దాన్ని హ్యాండోవర్ చేసుకున్నారు. తర్వాత తన టీంతో కలిసి గ్రాండ్‌గా కారును ఓపెనింగ్ కార్యక్రమం చేపట్టారు. బ్లాక్ కలర్‌లో ఉండే ఈ బెంజ్ కారులోనే చరణ్ ఇంటికి బయలుదేరారు. మొత్తానికి ఇప్పుడు చరణ్ ఇంటి ముందు ఈ కారును పార్కింగ్ చేశారు.
Also Read : BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి సరయూ నామినేషన్‌కు కారణాలివే
సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
చెర్రీ కొత్త కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్రక్ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో బాగా వైరల్ అవుతోంది.
హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర దాదాపు రూ. 2.5 కోట్లపైనే అట. చరణ్ (charan) దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూతో పాటు పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి బ్లాక్ కలర్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 వచ్చి చేరింది.
Also Read : EPFO : ఈపీఎఫ్ యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ అనుసంధానానికి గడువు తేదీ పొడిగింపు