Ram Charan with N T RamaRao మెగా, నందమూరి మధ్య ఉండే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే దానికి భిన్నంగా నిన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్‌ స్పీచ్ ఉంది. చరణ్ స్పీచ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఎంతో హుందాగా మాట్లాడాడని, తెలుగు జాతికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఎన్టీ రామారావు గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. బాలయ్య బాబు అంటూ సంబోధించి నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీ రామారావుతో తనకున్న కొద్ది పాటి పరిచయాన్ని చెప్పాడు. ఐదో క్లాసులో ఉన్న సమయంలో పురంధేశ్వరి అబ్బాయి రితేష్‌తో కలిసి స్కేటింగ్ క్లాస్‌లకు వెళ్తుండేవాడట చరణ్. ఓ సారి రితేష్ తన తాత ఇంటికి వెళ్దామని అడిగాడట. కానీ అప్పుడు ఆయన సీఎం అని, సీఎంకు ఇలాంటి సెక్యూరిటీ ఉంటుందనే అవగాహన కూడా తనకు లేదట. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అలా వెళ్లారట. అందరూ అనుకునేట్టుగానే ఆయన ఉదయాన్నే లేచి వ్యాయాయం చేసి ఆ టైంకే చికెన్‌తో తినేస్తున్నారట. 


తనకు కూడా బ్రేక్ ఫాస్ట్ పెట్టించాడని, ఆ మహానుభావుడితో అలా గడిపే క్షణాలు దొరికినందుకు చాలా లక్కీ అని చెప్పుకొచ్చాడు. అందుకే పురంధేశ్వరి ఆంటీకి థాంక్స్ అంటూ వేదిక మీదే చెప్పేశాడు రామ్ చరణ్. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత వరకు  ఎన్టీ రామారావు పేరు నిలిచి ఉంటుందని, ఆయన ఉన్న ఇండస్ట్రీలో తామంతా పని చేస్తున్నందుకు ఎంతో అదృష్టవంతులమని, ప్రపంచం నలుమూలలా తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రసంగించాడు.


Also Read:  NTR Centenery Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు యంగ్ టైగర్ దూరం.. రాత్రికి రాత్రే ఏం జరిగింది?


ఇక తనను గుర్తు పెట్టుకుని పిలిచిన బాలయ్యకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. మా బాలయ్య బాబు, మా చంద్రబాబు అంటూ అందరికీ థాంక్స్ చెప్పాడు. అలా హుందాగా రామ్ చరణ్‌ స్పీచ్ కొనసాగింది. చివరకు జై ఎన్టీఆర్ అంటూ ముగించేశాడు. ఈ స్పీచుతో నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. రామ్ చరణ్‌ ఎంతో హుందాగా, గొప్పగా మాట్లాడాడు అంటూ నందమూరి అభిమానులు ప్రశంసిస్తున్నారు.


Also Read:  Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook