Ram Charan will Unveil Puli Meka Teaser ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన పులి మేక వెబ్ సిరీస్‌ జీ5లో ప్రసారం కాబోతోంది. ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. రేపు పులి మేక టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ చేతుల మీదుగా ఈ టీజర్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థ్రిల్లింగ్ జోన‌ర్‌లో రూపొందిన ఈ ‘పులి - మేక’ వెబ్‌ ఒరిజిన‌ల్ కోసం‌ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జీ5 చేతులు క‌లిపింది. దీనికి సంబంధించిన టీజ‌ర్‌ ఫిబ్ర‌వ‌రి 17న న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నారు. చ‌ర‌ణ్ ఈ టీజ‌ర్‌ను డిజిట‌ల్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. అంటే సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను రామ్ చరణ్‌ విడుదల చేస్తాడు.


టాలీవుడ్‌లో కోన వెంక‌ట్‌ రైటింగ్‌కు ఉన్న సక్సెస్ రేట్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కోన వెంకటే అందించిన స్క్రిప్ట్‌తో.. పంతం డైరెక్టర్‌ కె.చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఓ  సీరియ‌ల్ కిల్ల‌ర్  వరుసగా పోలీస్ ఆఫీసర్లను చంపేస్తుంటాడు. అప్పుడు కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌టానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసిన ప్ర‌య‌త్నాలే ఈ పులి మేక. ఇందులో జ్యోతిష్యం కూడా ఓ కీల‌క‌మైన అంశంగా మ‌న‌కు కనిపించబోతోంది.


లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ పాత్ర‌లు కీలకంగా ఉంటాయి. హైద‌రాబాద్ నగ‌రంలో పోలీసుల‌ను ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ వ‌రుస‌గా చంపేస్తుంటాడు. అత‌న్ని ప‌ట్టుకోవ‌టానికి ఓ ఫొరెన్సిక్ ఎక్స్‌ప‌ర్ట్‌తో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ర‌న్ చేస్తున్న మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ ఏం చేసింద‌నేదే దీని మూల కథ.


ఆది సాయి కుమార్ గతేడాది వరుసగా సినిమాలను థియేటర్లో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆది ఇలా మొదటి సారిగా నేరుగా ఓటీటీలోకి రాబోతోన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఆదికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook