Ram Charan Gift to Manchu Manoj: కొత్త జంటకు రామ్ చరణ్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. ఆనందంలో తేలిపోయిన మంచు మనోజ్!
Ram Charan Upasana Gifts to Manchu Manoj: మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న ప్రేమ, కోపాలు, ద్వేషాలు అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫ్యామిలీల మధ్య అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒకసారి ఈ రెండు కుటుంబాలు బద్ద శత్రుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి.
Ram Charan- Upasana Gifts to Manchu Manoj: మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి గత నెలలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అతి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకలు మంచు వారి విభేదాలను బయటపెట్టేశాయి. ఆ పెళ్లిలో మంచు విష్ణు కనిపించకపోవడంతో.. మంచు వారి గొడవల మీద అందరికీ అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇక గత రెండు వారాల నుంచి మంచు వారి మీద వస్తోన్న వార్తల గురించి అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ మంచు మనోజ్ మధ్య మంచి బంధం ఉన్న సంగతి తెలిసిందే. విష్ణు ఎవ్వరితోనూ అంతగా కలవకపోయినా.. మంచు మనోజ్ మాత్రం అందరితోనూ బాగానే ఉండేందుకు ప్రయత్నిస్తాడు. మెగా ఫ్యామిలీతో మంచు మనోజ్ కాస్త క్లోజ్‌గానే ఉంటాడు. మంచు లక్ష్మీ సైతం సన్నిహితంగా ఉంటుంది. మంచు మనోజ్, రామ్ చరణ్ బంధం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిత్రమా అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంటాడు మనోజ్.
Also Read: Sneha Reddy Pics : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. కాక పుట్టించేలా పొట్టి డ్రెస్సులో స్నేహా రెడ్డి
రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమకు పంపిన ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్‌లను చూసి మనోజ్ మురిసిపోయాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. సర్ ప్రైజ్ గిఫ్ట్లు ఎప్పుడూ ఎంతో గొప్పగా, ప్రేమగా అనిపిస్తాయి.. ఇలా సర్ ప్రైజ్ చేసిన స్వీట్ కపుల్ రామ్ చరణ్ ఉపాసనలకు థాంక్స్.. లవ్యూ మిత్రమా.. మాల్దీవుల నుంచి వచ్చిన వెంటనే కలుస్తాను.. అంటూ మనోజ్ తన ప్రేమను తెలిపాడు.
ఈ ఇద్దరి ట్వీట్లు చూసిన నెటిజన్లు.. మంచు మెగా ఫ్యామిలీ బంధం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలే ఇప్పుడు ఎన్టీఆర్ బన్నీ రిలేషన్ మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. బావా అంటూ పిలుచుకోవడం, బన్నీకి ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పిన తీరు, బన్నీ రిప్లై ఇచ్చిన విధానంతో ఆ ఇద్దరి రిలేషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇలా మంచు మెగా ఫ్యామిలీ రిలేషన్ తెరపైకి వచ్చింది.
Also Read: AR Rahman For RC 16 : బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం ఏఆర్ రెహమాన్.. అప్పుడే నెగెటివ్ సెంటిమెంట్లు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook