Ram Charan wife Upasana Konidela Tests Positive For Coronavirus: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవలే తనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బుధవారం ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం తాను కరోనా నుంచి కోలుకున్నట్లు చెప్పారు. చెన్నైలో ఉన్న తన తాతయ్యని కలిసేందుకు వెళ్లాలనుకుని కరోనా టెస్ట్ చేయించుకోగా.. అసలు విషయం తెలిసిందని ఉపాసన పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు కరోనా సోకినట్టు కొద్దిసేపటి క్రితమే ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉన్న ఉపాసన.. ఓ ఫోటో కూడా షేర్ చేశారు. 'గతవారం నేను కరోనా బారినపడ్డాను. వ్యాక్సినేషన్‌ తీసుకోవడంతో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. వైద్యులు కేవలం పారాసిటిమాల్‌, విటమిన్‌ టాబ్లెట్స్ మాత్రమే వాడమని చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నా. విశ్రాంతి తీసుకుంటూనే.. మళ్లీ లైఫ్‌ని అన్నివిధాలుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యా' అని ఉపాసన ట్వీట్ చేశారు. 



'కరోనా మహమ్మరి నుంచి కోలుకున్నాక.. శారీరకంగా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నా. మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతుందా? అంటే కచ్చితంగా ఏమీ చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండటం చాలా ముఖ్యం. ఏదేమైనా సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యం. చెన్నైలో ఉన్న మా తాతయ్యని కలిసేందుకు సిద్దమయ్యా. ముందస్తులో భాగంగా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే విషయం ఎవరికీ తెలిసేది కాదు. డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ వీర్‌ప్రకాష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు' అని ఉపాసన పేర్కొన్నారు. 


2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండగా.. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. చరణ్, ఉపాసనకు పెళ్లై దాదాపుగా పదేళ్లు అవుతోంది. 


Also Read: Bill Gates Covid 19: బిల్‌ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం!


Also Read: Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.