Tamannaah Bhatia Owns 5th Biggest Diamond In World: మిల్క్ బ్యూటీ తమన్నా సౌత్ చిత్రాలతోపాటు బాలీవుడ్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె (Tamannaah Bhatia) నటించిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాల్లో విడుదలై మంచి విజయం సాధించాయి. అయితే ఇందులో తమన్నా బోల్డ్ సీన్స్ చేయడంపై నెట్టింట తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనికి గట్టి సమాధానమే ఇచ్చింది మిల్క్ బ్యూటీ. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలతోపాటు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొనసాగించిన ప్రేమాయణం గురించి నెట్టింట ఎక్కువగా చర్చ జరిగింది. తాజాగా మరోసారి తమన్నా వార్తలోకెక్కింది. మిల్క్ బ్యూటీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రాన్ని ధరించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంతపెద్ద డైమండ్ రింగ్ ఈమె వద్దకు ఎలా వచ్చిందో తెలుకుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ చేసిన సైరా నరసింహారెడ్డి (Sye Raa Narasimha Reddy) సినిమాలో తమన్నా ఓ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మిల్క్ బ్యూటీ నటనకు ఫిదా అయిన మెగా కోడలు ఉపాసన ఆమె కాస్టలీ డైమండ్ రింగ్ గిప్ట్ గా ఇచ్చింది. ఇది వరల్డ్‏లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన డైమండ్ రింగ్. దీని ఖరీదు రూ. 2 కోట్లు వరకు ఉంటుందని టాక్. తాజాగా తమన్నా ధరించిన ఆ ఉంగరం ఫోటోను షేర్ చేస్తూ.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది ఉపాసన. తాజాగా దీనిపై తమన్నా రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం తమన్నా రజనీకాంత్ సరసన జైలర్ మూవీలో నటిస్తోంది. మరోవైపు చిరంజీవి భోళాశంకర్ లో కూడా చేస్తోంది. 


Also Read: Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ సీజన్ 7 సీక్రెట్ రివీల్ చేసిన కింగ్ నాగార్జున..


Also Read: Indian 2 Update: ఇండియన్‌ 2లో సరికొత్త టెక్నాలజీ.. నయా ప్లాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న శంకర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook