Ashu Reddy Rgv Trolls: కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఈ వివాదాస్పద డైరెక్టర్ ఏమి చేసినా వెరైటీనే. ఇటీవల ఆయన అషూరెడ్డితో చేసిన ఇంటర్వ్యూ అయితే ఇక చెప్పనక్కర్లేదు. అందులో అషురెడ్డి కాళ్లను నాకడంపై భారీ ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్స్ విరుచుకుపడ్డారో ఓ సారి యూట్యూబ్ చూస్తే తెలిసిపోతుంది. అంత హాట్ టాపిక్ మరి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. తనపై కామెంట్స్ చేసిన వారిపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను దేవుడిని న‌మ్మ‌నని.. కాబ‌ట్టి దేవుడు ఏం చెప్పాడ‌నేది ప‌ట్టించుకోనని అన్నాడు ఆర్జీవీ. అలాగే నైతిక‌, సమాజం ఏమ‌నుకుంటుంద‌నేది విష‌యాల‌ను కూడా ప‌ట్టించుకోనని చెప్పాడు. మ‌నం ఎదుటి వ్య‌క్తితో మాట్లాడే సంద‌ర్భంలో వాళ్ల‌కి ఇబ్బంది లేన‌ప్పుడు.. ఇంకెవ‌రికో ఇబ్బంది అవుతుంద‌నే విష‌యంలో ఐ డోంట్ కేర్‌ అంటూ తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు కింగ్ ఆఫ్ కాంట్రవర్సీ.


అషూ రెడ్డి ఇంటర్వ్యూలో ఎలా ప్ర‌వ‌ర్తించానో.. ఎందుకు చేశానో తనకు తెలుసన్నాడు ఆర్జీవీ. ఆమె కాలిని ముద్దు పెట్టుకున్నా.. ఏం చేసినా కానీ దాన్ని అంతా ఓ ఫ్రేమ్‌లో పెట్టాల‌నుకుంటున్నానని.. తాను ఆ ఇంట‌ర్వ్యూ పెట్టిందే క‌మ్యూనికేట్ చేయ‌టానికి అని చెప్పాడు. ఆ ఇంట‌ర్వ్యూ వెనుకున్న ఇన్‌టెన్ష‌న్‌ను చెప్పాల‌నుకుంటున్నానని.. తాను ఎవ‌రి కోసం ఈ ప‌ని చేయ‌టం లేదని స్పష్టం చేశాడు. మ‌నిషి పుట్టి పెరిగిన త‌ర్వాత బ‌తుకున్న‌ప్ప‌టి వ‌ర‌కు ఓ క్లారిటీ ఉండాలని చెప్పాడు. 


ట్విట్ట‌ర్ అనేది వ్య‌క్తిగ‌త క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్‌ అని.. తనను ఇష్ట‌ప‌డి ఫాలో అయ్యేవాళ్లు, క్యూరియాసిటీతో ఫాలో అయ్యేవాళ్లు అందులో ఉంటారని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. తాను మాట్లాడే మాట‌లు.. వీడియోలు న‌చ్చ‌క‌పోతే అందులోనుంచి లాగ‌్ అవుట్ అయ్యి వెళ్లిపోవ‌చ్చని హితవు పలికాడు. తాను ఎవ‌రినీ ప‌ట్టించుకోవాలనుకోవడం లేదన్నాడు ఆర్జీవీ. అషూ రెడ్డికి, తనకు మ‌ధ్య అభ్యంత‌రం లేకుండా చేసిన చేష్ట‌లన్నీ తమ ఇద్ద‌రి మ‌ధ్య‌నే ఉంటాయన్నాడు. మిగ‌తా వాళ్లు చూడొచ్చు.. చూడొక‌పోవ‌చ్చు. ఏమైనా అనుకోవ‌చ్చన్నాడు. అందులో మా ఇద్ద‌రికే అభ్యంత‌రం ఉండాలన్నాడు. ఇష్టం లేక‌పోతే చూడ‌టం మానేయాలని.. వేరే ప‌నులు లేవా..? అని అన్నాడు. తాను చేయాల‌నుకుంది చేస్తానని.. తన చావు తాను చ‌స్తానన్నాడు. మీ చావు మీరు చావండి అనేదే తన లైఫ్ ఫిలాస‌ఫీ అని చెప్పాడు.


Also Read: Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే.. రిప్లై మాత్రం అదుర్స్  


 Also Read: Rajinikanth Birthday: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ బర్త్‌ డేకు స్పెషల్ గిఫ్ట్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook