RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు. అందులో కొన్ని సెలబ్రిటీలను టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. మరికొన్ని జనరల్ పోస్టులు ఉంటాయి. కానీ అంతర్జాతీయ అంశాలపై చాలా అరుదుగా స్పందిస్తుంటాడు ఆర్జీవి.
తాజాగా ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు నెజెటన్లను ( Netizens ) అలరిస్తోంది. ఇందులో ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డైలాగ్స్ ఉన్నాయి.
ఒబామా ( Barack Obama ) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టాప్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ అమెరికా ఆపరేషన్ సమయంలో మరణించాడు. అదే విధంగా ట్రంప్ వచ్చాక ISIS లీడర్ అబు బకర్ అల్ బగ్దాదీ ఒక అమెరికాన్ ఆపరేషన్ సమయంలో అంతం అయ్యాడు. అయితే వీటిని ప్రపంచానికి తెలిపే సమయంలో ఆ ఇద్దరు అధ్యక్షులు ఎలా ప్రవర్తించారు.. ఎలాంటి మాటలను ఉపయోగించారు అనేదే వీడియో.
ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ
లాడెన్ మరణం గురించి తెలిపే సమయంలో ఒబామా చాలా అధికారిక పదాలు వాడాడు. ఆపరేషన్ గురించి, అమెరికా సాధించిన విజయాల గురించి హుందాగా తెలిపి... ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు.
కానీ ట్రంప్ ( Donald Trump) మాత్రం బగ్దాదీ మరణం గురించి తెలుపుతూ...అబూ.....బకర్.... అల్...బగ్దాదీ మరణించాడు. వాళ్లు చాలా షూటింగ్ చేశారు. వాళ్లు చాలా బ్లాస్టింగ్స్ చేశారు అని తెలిపాడు. మరణించింది ఎవరైనా గౌరవించాలి అనేది ఒబామా పాటించిన నియమం. కానీ ట్రంప్ మాత్రం బగ్దాదీ కుక్కచావు చచ్చాడు..దాని క్రెడిట్ మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అని అన్నాడు. దాంతో పాటు దీనిపై ఒక బుక్ రాస్తున్నా అన్నాడు ట్రంప్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR