Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నాగ్ అశ్విన్ సినిమా గురించి రోజుకో కొత్త వార్త రావడం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Last Updated : Oct 10, 2020, 01:49 PM IST
    • ప్రభాస్ అభిమానులకు శుభవార్త

    • టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

    • వివరాలు మీకోసం...

Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నాగ్ అశ్విన్ సినిమా గురించి రోజుకో కొత్త వార్త రావడం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవలే ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) బచ్చన్ కీలక పాత్ర చేయనున్నట్టు దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బిగ్ బీ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు... ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఉంటుందా..లేక గెస్ట్ రోలా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే

గతంలో..

ఇంతకు ముందు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రెండు తెలుగు చిత్రాల్లో కనిపించాడు. అక్కినేని కుటంబం మొత్తం కనిపించిన మనం మూవీలో గెస్ట్ రోల్ చేశాడు. అది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటించిన సైరా మూవీలో కూడా అతిథి పాత్రలోనే కనిపించాడు. దీంతో ప్రభాస్ మూవీలో ఆయన ఎంతసేపు ఉంటాడో అని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.

ALSO READ|  Mental Stress In Kids: పిల్లల మానసిక ఆరోగ్యం జాగ్రత్త

నాగ్ అశ్విన్ క్లారిటీ..

ప్రభాస్ మూవీలో అమితాబ్ బచ్చన్ పాత్రపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో ఆయన పాత్ర అత్యంత ప్రధానమైన పాత్ర అని...మూవీలో మొత్తం ఆయన ఉంటాడు అని తెలిపాడు నాగ్ అశ్విన్. దాంతో పాటు మరో కీలకమైన విషయం కూడా వెల్లడించాడు. ఈ మూవీలో అమితాబ్ ఏ పాత్ర పేరే సినిమా టైటిల్ అని తెలిపాడు. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News