Ram Gopal Varma Sensational Comments on Pawan kalyan and Chandrababu Meeting: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. రాజకీయ వర్గాల్లో ఈ విషయం మీద అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండడంతో మరోసారి పొత్తు పెట్టుకుని ముందుకు వెళతారా అనే ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున తెరమీదకు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గతంలో తనను విశాఖపట్నంలో పర్యటించకుండా ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు చంద్రబాబు తనకు సంఘీభావం తెలిపారు కాబట్టి ఇప్పుడు ఆయనని కుప్పంలో అడ్డుకున్నారు కాబట్టి తాను సంఘీభావం తెలిపానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఈ భేటీ అనంతరం ఈ ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పొత్తుల గురించి కూడా ప్రస్తావన రాగా రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏమైనా చేస్తాయని అలాంటిదేమైనా ఉంటే మేమే తెలియజేస్తామని పేర్కొన్నారు.


అయితే ఈ అంశం మీద వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్లు వినిపించాయి.  పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడు అని చంద్రబాబు ఏమి చేయమంటే అది చేస్తారని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ అనూహ్యంగా ఈ అంశం మీద రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు, రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు.  


అయితే రామ్ గోపాల్ వర్మ ముందు నుంచి వైఎస్ జగన్ కు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఆయన రాజకీయ పార్టీకి పనికి వచ్చే విధంగా సినిమాలు చేస్తారన్న పేరు ఉంది. రాంగోపాల్ వర్మ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటూనే వస్తున్నాడు. ఇప్పుడు కూడా జగన్ కి అనుకూలంగా రెండు సినిమాలు చేసేందుకు ఆయన ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. వైఎస్ జగన్ తో భేటీ అయి కూడా వచ్చారు.


ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మ మీద కౌంటర్లు పడుతున్నాయి. కామంతో కాళ్లు నాకావు అనుకున్నా కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు రాంగోపాల్ వర్మ కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. మరి వర్మ ఈ కౌంటర్ కి ఎలా ప్రతిస్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. 


Also Read: Vaarasudu Postponed : వారసుడు విడుదల వాయిదా.. అధికారికంగా ప్రకటించననున్న దిల్ రాజు.. ఎందుకంటే?


Also Read: Akhilesh Yadav Tea: పోలీసులు ఇచ్చిన టీ తాగనన్న అఖిలేష్...విషం అనుమానం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook