RGV`s Comments on Chiranjeevi and Aadi: చిరంజీవి గాలి తీసేసిన వర్మ.. ఆది లాంటి వాళ్లను దూరం పెట్టమని సలహా
RGV`s Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు. జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయిన చిరంజీవి వాస్తవికతకు దూరం అవుతున్నారని అనిపిస్తోందని రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తంచేశాడు. అంతటితో సరిపెట్టుకోని రాంగోపాల్ వర్మ.. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరని... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు అంటూ మరో ట్వీట్ చేశారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే మంచిది అని చిరంజీవికి సూచించారు.
తన ట్వీట్స్‌లో నేరుగా చిరంజీవి అని పేరు పెట్టకుండా మెగా అనే పదం ఉపయోగించిన రాంగోపాల్ వర్మ.. భోళా శంకర్ సినిమా విడుదలైన రోజే ఈ ట్వీట్ చేయడాన్ని చూస్తే.. భోళా శంకర్ మూవీ ఫలితాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని అర్థం అవుతోంది. రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పై మిక్స్‌డ్ రియాక్షన్ కనిపిస్తోంది. జబర్దస్త్ హైపర్ ఆదిని ఉద్దేశించే కదా మీరు ఈ ట్వీట్ చేసింది అని ఇంకొంతంది వర్మను ప్రశ్నిస్తూ కనిపించారు. హైపర్ ఆది నిజం చెప్పడం మీకు ఇష్టం లేకనే ఇలా అంటున్నారు అని ఓ మెగా అభిమాని స్పందించాడు. .హైపర్ ఆది కామెంట్స్ విని బాగా ఫీల్ అయ్యారని.. హైపర్ ఆది నిజాలు చెప్పాడనే ఒప్పుకొలేక భజన అంటున్నారన్న సదరు మెగా ఫ్యాన్.. ఏమి తెలియకుండానే చిరంజీవి ఈ స్థాయికి వచ్చాడనే భ్రమలో ఉన్నారని రాంగోపాల్ వర్మను ఎద్దేవా చేశారు. చిరంజీవి లాంటి పేరున్న హీరోకు చెప్పే స్థాయి మీకు లేదని పనికిరాని మీ తెలివైన బుర్రకు ఇంకా అర్దం కాలేదా అని చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి : Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!
మరొక నెటిజెన్ రాంగోపాల్ వర్మ ట్వీట్ కి స్పందిస్తూ.. మీరు చెప్పిన మాటలకే మీరే ఉదాహరణ అని అన్నారు. మన మీద మనకు క్లారిటీ లేకపోతే 'పొగడ్తలని' నమ్మి మోసపోతాం. మీరు అది నిజం అని నిరూపించారు. అభిమానిగా పొగిడి, పార్టీ పెట్టేలా ఒత్తిడి చేసి.. ఆ హీరో బతుకు బజారునపడేటట్లు చేశారని.. తీరా పార్టీ పెట్టాకా ఇప్పుడు మీరే మళ్లీ తిడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశించి సదరు నెటిజెన్ కామెంట్ రూపంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Bhola Shankar Review: భోళా శంకర్ మూవీ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి