DISHA ENCOUNTER Trailer released: యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే భిన్నంగా ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో అంతే వివాదాల్లో చిక్కుకుంటాయి. అయితే 2019 నవంబ‌ర్‌లో దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ‌లో జ‌రిగిన దిశా (disha) అత్యాచార, హత్య, ఆతర్వాత నిందితుల ఎన్‌కౌంటర్ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్‌కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ ద్వారా నిన్న పోస్టర్ రిలీజ్ చేసి ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేస్తానని వెల్లడించిన విష‌యం తెలిసిందే. అనుకున్న సమయం ప్రకారమే వర్మ శనివారం ఉదయం దిశా ఎన్‌కౌంటర్ సినిమా ట్రైలర్‌ (Disha Encounter Trailer Released) ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో వర్మ దిశా సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అయితే ఈ ట్రైలర్‌లో శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు మానవ మృగాలు ఒక యువతిపై ఎలా దాడి చేసి ఎలా పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్..  నేపథ్యంతో వర్మ ఇంటెన్స్ థ్రిల్ల‌ర్‌ అండ్ ఎమోషనల్‌ సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ 'దిశా ఎన్‌కౌంటర్' చిత్ర ట్రైలర్‌లో సంఘటన నన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దిశా తన బైక్ పార్క్ చేయడం.. నలుగురు నిందితులు పన్నాగం పన్ని బైక్ గాలి తీయడం, ఆ తర్వాత దిశను చంపడం లాంటీ సన్నివేశాలతో ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తుండగా.. దీనికి ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  Also read: SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి


అయితే అంతకుమందు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల ఆధారంగా పవర్ స్టార్ (powerstar) సినిమా తీసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన మిర్యాలగూడెం ప్రణయ్ హత్య ఆధారంగా మర్డర్ (murder) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ చిత్రం కూడా వివాదంలోనే ఉంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశా అత్యాచర సంఘటన ఆధారంగా వర్మ తీస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.  Also read : SPB last rites: బాలుకు నివాళులర్పించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్