SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి

SPB cremated at Thamaraipakkam farmhouse: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్రౌత శైవ వైదిక శైవ సంప్రదాయం ప్రకారం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి. చరణ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Last Updated : Sep 26, 2020, 01:35 PM IST
SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి

SPB cremated at Thamaraipakkam farmhouse: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. శ్రౌత శైవ వైదిక శైవ సంప్రదాయం ప్రకారం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి. చరణ్ ( SP Charan ) చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాల మధ్య బాలు అంత్యక్రియలు జరిగాయి. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి తమిళనాడు పోలీసులు బాలుకి అంతిమ నివాళి అర్పించారు. బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాల ( SPB last rites ) సందర్భంగా ఆయన్ని కడసారి చూసుకుంటూ కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో ప్రముఖులు, అభిమానులు తామరైపాక్కంలోని బాలు వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చారు. Also read : SPB News: వెంటాటి వెంటాడి వేధించి తీసుకెళ్లిపోయింది: గాయని సుశీల ఆవేదన

ఐతే ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 guidelines ) అమలులో ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా అందరినీ లోపలికి అనుమతించకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే అతి సమీప బంధువులు, సన్నిహితులు, ప్రముఖులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అయినప్పటికీ బాలు వ్యవసాయక్షేత్రం పరిసరాలు ప్రముఖులు, అభిమానుల రాకతో జన సంద్రంగా మారాయి. Also read : SPB last rites: బాలుకు నివాళులర్పించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్

Trending News