Ram Pothineni: మా అమ్మకే అనుమానం తెప్పించారు మహానుభావులు.. అందుకే అలా మాట్లాడా.. ఓపెనయిన రామ్!
Ram Pothineni Clarity on Marriage: ది వారియర్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా రామ్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ లవ్ వ్యవహారం మీద ఎందుకు స్పందించాను అనే విషయం మీద పెదవి విప్పారు.
Ram Pothineni Clarity on Marriage Rumors: అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. రామ్ పోతినేని గత కొద్దిరోజుల క్రితం తన స్కూల్ లవర్ ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఏ లెవెల్ కి వెళ్లిందంటే స్వయంగా ఆయనే నాకు లవర్ లేదు రా బాబోయ్ అంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గురువారం నాడు ది వారియర్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా రామ్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన ఈ లవ్ వ్యవహారం మీద ఎందుకు స్పందించాను అనే విషయం మీద పెదవి విప్పారు. ఈ లవ్ రూమర్స్ మీద స్పందించిన రామ్ సాధారణంగా తాను గాసిప్స్ గురించి మాట్లాడానని చెప్పుకొచ్చారు. నాతో కూడా ఈ గాసిప్స్ గురించి ఎవరూ చర్చించరు కానీ ఈ సీక్రెట్ చైల్డ్ హుడ్ గర్ల్ ఫ్రెండ్ అనే వ్యవహారం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నారు. ఇంట్లో వాళ్ళు సైతం డౌట్ డౌట్ గా నన్ను చూడడం మొదలుపెట్టారని పేర్కొన్నారు, తన స్నేహితులు కూడా నెమ్మదిగా మాకే తెలియకుండా ఏమైనా నడిపావా అంటూ ఫోన్లు చేయడం మొదలు పెట్టారని వెల్లడించాడు.
అసలు కొందరు స్నేహితులు అయితే ఏమీ లేకుండా రాస్తారంటావా అని అడిగారని ఇంట్లో మా అమ్మ కూడా ఇది నిజమేనా అని అడగడంతో ఇక స్పందించక తప్పలేదని రామ్ చెప్పుకొచ్చారు. అందుకే వెంటనే అసలు నేను స్కూల్ కి వెళితే కదా అలా ఎవరైనా ఉండడానికి అని అమ్మతో అనడంతో ఆమె రియలైజ్ అయిందని అందుకే అదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో రామ్ తన పెళ్లి గురించి కూడా స్పందిస్తూ ఈ ప్రేమ పుకారు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందని ఎప్పుడైనా అనిపించిందా అంటే అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు.
అయితే పెళ్లి గురించి ఏమైనా ఇంట్లో ఒత్తిడి పెరిగిందా అంటే అదీ లేదని ఒకవేళ పదిసార్లు అడిగితే మాత్రం పెళ్లి చేసుకుంటామా ఏంటి మనకు చేసుకోవాలనిపించినప్పుడే కదా చేసుకుంటాం అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలా రామ్ తన ప్రేమ, పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు అయింది.
Also Read: Rana Daggubati: వివాదంలో దగ్గుబాటి రానా.. ఒత్తిడి చేయడంతో కోర్టు కేసు?
Also Read: Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook