Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!

Gangavva caravan tour:   ప్రస్తుతం గంగవ్వ కొన్ని సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ కోసం, అలాగే సినిమాల షూటింగ్స్  కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమెకు నిర్మాతలు కేరవాన్ ఏర్పాటు చేస్తున్నారు. 

Last Updated : Jul 12, 2022, 05:26 PM IST
  • లేటు వయసులో గంగవ్వ సూపర్ క్రేజ్
  • ప్రమోషన్స్ లో గంగవ్వ
  • స్పెషల్ క్యారవాన్ వీడియో
 Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!

Gangavva caravan tour  in  Virata Parvam Promotion: లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరు చెప్పలేరు. సాధారణంగా 50-60 ఏళ్లు దాటితే ఇక జీవితం అయిపోయింది అన్నట్టు భావిస్తూ ఉంటారు కొంతమంది. కానీ లైఫ్ ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం ఇస్తుంది? అనేది బహుశా భగవంతుడు కూడా చెప్పలేడేమో. అలా వయసు మళ్లిన తర్వాత సెలబ్రిటీగా మారిన వారిలో గంగవ్వ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఎలాంటి చదువు సంధ్యలు లేని ఒక పల్లెటూరి పక్కింటి అవ్వలాంటి గంగవ్వ ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారింది.

సినీ ప్రమోషన్స్ కోసం గంగవ్వను రంగంలోకి దించుతున్నారు అంటే ఆమె రేంజ్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ మై విలేజ్ షో అనే ఒక ఛానల్ ద్వారా పేరు తెచ్చుకుంది. అలా యూట్యూబ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న గంగవ్వ బిగ్ బాస్ షో కి కూడా వెళ్లి తాను ఉండగలిగినన్నాళ్లు ఉండి ప్రేక్షకులను అలరించింది. అయితే నిత్యం ప్రకృతిలో సేదతీరే గంగవ్వ లాంటి వారు ఈ ఏసీ గదులలో మధ్య ఎన్ని రోజులు ఉండగలరు చెప్పండి> అందుకే అనారోగ్య కారణాలతో ఆమె బయటకు వచ్చేసింది.

అయితే తాను బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చింది తన ఇల్లు పూర్తి చేసుకోవడం కోసం అని గంగవ్వ చెప్పడంతో నాగార్జున సహా పలువురు ముందుకు వచ్చి ఆమె ఇల్లు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆమె ఇల్లు నిర్మితం అయిపోయింది. కొత్త ఇంట్లో ఆమె కాపురం ఉంటున్నారు. అయితే అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్న ఆమె మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ కోసం, అలాగే సినిమాల షూటింగ్స్  హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమెకు నిర్మాతలు కేరవాన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ విషయాన్ని తాజాగా మై విలేజ్ షో విలోగ్స్ లో ఈ క్యారవాన్ ను కూడా చూపించారు. గంగవ్వ నెట్ ఫ్లిక్స్ కోసం రానా, సాయి పల్లవిలను ఇంటర్వ్యూ చేసింది. ఇక అప్పుడే ఆమెకు ఈ క్యారవాన్ ఎలాట్ చేశారు. ఈ మధ్య ఒక మోస్తరు క్రేజ్ ఉన్న వారికి కూడా క్యారవాన్ ఫెసిలిటీ కల్పిస్తున్నట్లు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గంగవ్వకు కూడా క్యారవాన్ ఏర్పాటు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News