Double Ismart Movie Review: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ..
Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, అలీ, కావ్య థాపర్, ఉత్తేజ్, సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి తదితరులు
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు, జియానీ జియానెల్లి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటించిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు. మరీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
బిగ్ బుల్ (సంజయ్ దత్) మన దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దేశ విదేశాల్లో అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ దందా చేస్తూ మన దేశానికి సవాల్ విసురుతుంటాడు. అంతేకాదు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పన్నుతాడు. ఇక అతన్ని పట్టుకోవడానికి మన దేశం ‘రా’ ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు ‘రా’కు తన ఫోటో కూడా దొరక్కండా జాగ్రత్త పడేంత మోస్ట్ డేంజరస్ క్రిమినల్. ఈ క్రమంలో అతనికి బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లెమ్ ఉన్నట్టు డాక్టర్స్ చెబుతారు. అంతేకాదు ఈ సమస్యతో ఎక్కువ రోజులు బతకడని డిసైట్ చేస్తారు. ఒక డాక్టర్ మాత్రం అతని మెమరీని వేరే వారికి ట్రాన్స్ ఫర్ చేస్తే .. బతుకుతాడని చెబుతారు. కట్ చేస్తే ఇస్మార్ట్ శంకర్.. ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ ఫర్ వ్యక్తి అన్న సంగతి తెలుసుకుంటాడు బిగ్ బుల్. అతని మెదుడులోకి తన మెమరీ ని ట్రాన్స్ ఫర్ చేయడానికి అతన్ని కిడ్నాప్ చేస్తాడు. ఈ క్రమంలో బిల్ బుల్ మెమరీని ఇస్మార్ శంకర్ దిమాగ్ లోకి డాక్టర్ సహాయంతో ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు బిగ్ బుల్. శంకర్ మెదడులోకి బిగ్ బుల్ మెమరీ రాగానే అతను ఎలా ప్రవర్తించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినట్ బిగ్ బుల్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు. బిగ్ బుల్ కు ఇస్మార్ట్ ఉన్న వైరం ఏమిటి ? చివరకు ఇస్మార్ట్ శంకర్ దేశ ద్రోహి అయిన బిగ్ బుల్ ను చట్టానికి పట్టించాడా.. ? ఈ సందర్బంగా శంకర్ లవర్ జన్నత్ (కావ్య థాపర్) ఎలా సహాయ పడిందనేదే ‘డబుల్ ఇస్మార్ట్’స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడుగా పూరీ జగన్నాథ్ ను తక్కువ అంచనా వేయవద్దు. ఫ్లాపుల్లో ఉన్నపుడల్లా గోడకు కొట్టిన బంతిలా పైకి లేవడం పూరీ జగన్నాథ్ స్టైల్. గతంలో తాను తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని మెమరీ ట్రాన్స్ ఫర్ కథనే ఈ సీక్వెల్ కోసం వాడుకున్నాడు. అంతేకాదు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుననే మోస్ట్ వాండెట్ క్రిమినల్ ను ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ ఎలా చట్టానికి పట్టించాడనేది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తే బాగుండేది. సినిమా ప్రారంభంలోనే ఒక చైనీస్ గ్యాంగ్ స్టర్స్ ను బిగ్ బుల్ ఎలా అంతం చేసాడనే ఎపిసోడ్ తో విలన్ ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అన్న సంగతిని తెరపై చూపించాడు. అంతేకాదు చివరకు విలన్ బలవంతుడనే విషయాన్ని అడుగడున గుర్తు చేసాడు.
బిగ్ బుల్ పాత్ర కోసం వేరే ఎవరు చేసిన అంతగా పండేది కాదు. కానీ ఈ క్యారెక్టర్ కు సంజయ్ దత్ వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమా మొత్తం హీరో రామ్ పోతినేని పాత్రతో సమానంగా విలన్ సంజయ్ దత్ పాత్రను చూపించాడు. అంతేకాదు విదేశాల్లో ఉండే గ్యాంగ్ స్టర్స్స్ అతని సెక్యూరిటీ గట్రా ఎలా ఉండటాయనేది తెరపై ఎంత లావిష్ గా చూపించాడు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అయితే సినిమా ఇంటర్వెల్ లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా పోకిరి, టెంపర్ తరహా ఫార్ములానే అప్లై చేసాడు. సినిమా మొత్తం ఏదో వెగటు కామెడీ.. హీరోయిన్ తో అంగాంగ ప్రదర్శనతో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమా మొత్తం నడిపించి చివర్లో మాత్రం దేశభక్తికి దైవభక్తి జోడించి ముగించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రస్తుతం మన దేశంలో కొన్ని రాజకీయ శక్తులు దేశాన్ని కులాలు, మతాలు అంటూ విద్వేషాలు సృష్టించి దేశ విభజన కుట్రలు చేస్తోన్న వారికీ తన సినిమాలోని డైలాగులతో మంచి గుణపాఠం చెప్పాడు. మొత్తంగా పూరీ తాను చెప్పాలనుకున్నదాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేసాడు. ఈ సినిమాలో అలీతో కామెడీ ట్రాక్ నవ్వించినా.. అది అసహ్యం జుగుప్సా పుట్టేలా ఉంది. సినిమాలో అలీ ట్రాక్ లేకున్నా ‘డబుల్ ఇస్మార్ట్’ కథకు పెద్ద వచ్చిన నష్టం ఏమి లేదు. సినిమా చివర్లో నీతి చెప్పిన పూరీ జగన్నాథ్.. అలీ కామెడీతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అని సగటు ప్రేక్షకులు ప్రశ్నించేలా ఆ కామెడీ ట్రాక్ వుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా చోట్ల పని చెప్పలేదనే విషయం స్పష్టమైంది. ‘ఇస్మార్ట్ శంకర్’లో ఉన్న టెంపో ‘డబుల్ ఇస్మార్ట్’లో లేకుండా పోయింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాలో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. తన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాడు. పాటలు మాస్ ను కిర్రెక్కించేలా ఉన్నాయి.
నటీనటల విషయానికొస్తే..
రామ్ పోతినేని.. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ గా మరోసారి హైదరాబాదీ యాస, భాషలో అదరగొట్టేసాడు. తన పాత్రకు న్యాయం చేసాడు. సంజయ్ దత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బుల్ గా తన యాక్టింగ్ తో ఆ పాత్రకు తాను తప్పించి వేరేవరు చేయనంతగా మెస్మరైజ్ చేసాడు. కావ్య థాపర్.. ఉన్నంతలో బాగానే నటించింది. షాయాజీ షిండే ‘రా’ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు.
గెటప్ శ్రీను నటన పర్వాలేదు. అలీ నటనలో కొత్తదనం చూపించినా.. అది ప్రేక్షకులకు వెగటు పుట్టించేలా ఉంది. తన లైఫ్ లో ఇంత కంటే చెత్త పాత్ర మరొకటి లేదేమో అనే రీతిలో అసహ్యం పుట్టించేలా చేసాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
ప్లస్ పాయింట్స్
రామ్, సంజత్ దత్ ల పోటాపోటీ నటన
మణిశర్మ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్ లో వచ్చే కొన్ని డైలాగులు
మైనస్ పాయింట్స్
సీక్వెల్ తగ్గ కథ లేకపోవడం
ఎడిటింగ్
అలీ కామెడీ
పంచ్ లైన్.. మాస్ ను మెస్పించే ‘డబుల్ ఇస్మార్ట్’..
రేటింగ్..2.75/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter