Ram Next: రామ్ పోతినేని.. హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరో . ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్ చిత్రం ఫ్లాప్ తర్వాత పూరి తీస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. స్కంద ప్లాప్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న నెక్స్ట్ సినిమా కూడా ఇదే. ఒకరకంగా చెప్పాలి అంటే ఇద్దరు ఒకే లైన్లో ఉన్నారు. కరెక్ట్ హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సినీ మార్కెట్ ట్రెండ్ చాలా మారుతుంది .. బాగా ఆడి ..థియేట్రికల్ ఆక్యుఫెన్సీ, రన్ పరంగా లాభాలు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్స్ ని సేఫ్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అందుకే వీళ్ళ ఖాతాలో కొందరు హీరోలు ఫేవరెట్ట్లుగా ఉన్నారు . కొంతమంది నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాల కోసం పరుగులు పెట్టి చేతులు కాల్చుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం కంటెంట్ను నమ్మి తక్కువ బడ్జెట్ తో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి వండర్ కి రీసెంట్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీ.


మరోపక్క హీరోలు వరుసగా తమ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. అయితే మరో పక్క తమ సినిమాలు ఫ్లాప్ అయితే వెంటనే ఆదుకునే హీరోలు కూడా ఉన్నారు. ఆచార్య, భోళా శంకర్ మూవీస్ తో డిజాస్టర్ చవిచూసిన చిరంజీవి.. తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో కొంత వెనక్కి ఇచ్చేసాడని టాక్. ఇంకా ఇవ్వాల్సిన డబ్బు కొంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ చిరంజీవి వద్దు అని చెప్పారంటూ నిర్మాత అనిల్ సుంకర బహిరంగంగానే ప్రకటించారు.


ప్రస్తుతం తమ కెరీర్ లో ఉన్న హిట్, ఫ్లాప్స్ ని బేరీజు వేసుకొని.. లాస్ట్ సినిమా ఎఫెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని హీరోలు తమ రెమ్యూనరేషన్ తీసుకుంటే ఎవరికీ ఏ బాధ ఉండదు. అయితే కొందరు మాత్రం వరుస ప్లాపులు వెంటపడుతున్న రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లేదు అలాంటి పరిస్థితి ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నిర్మాత ఎదుర్కొంటున్నారు. రామ్ కోట్ చేసిన రమ్యునరేషన్ చూసి ఆ నిర్మాత భయపడిపోయాడట.. అంతేకాదు ఆ రెంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేము అని చెప్పి ప్రాజెక్టు వదిలేసాడట.


సరియైన హిట్టు లేక ..ఏదో రొటీన్ సినిమాలతో ముందుకు వెళ్తున్న రామ్ పోతినేని.. మరీ అంత రెమ్యూనరేషన్ అడగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్ లో నెక్స్ట్ హిట్ ఇంతవరకు పడలేదు. రీసెంట్ గా వచ్చిన స్కంద మూవీ ట్రోలింగ్ ఎదుర్కొన్నంతగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. స్టార్ హీరోలే తమ మార్కెట్కు తగ్గట్టు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. రామ్ ఏకంగా 25 కోట్లు అడిగేస్తున్నాడట. ఈ అమౌంట్ విన్న నిర్మాత.. ఫైనల్ గా రామ్ తో సినిమానే వద్దనుకున్నాడట.


Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్‌ కాస్కో అంటూ సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు


Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..


 


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook