Ramayanam: ఎట్టకేలకు ముంబైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన `రామాయణం` మూవీ..
Ramayanam: రామాయణం ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని పురాణేతి హాస కావ్యం. తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటి వరకు రామాయణ గాథపై ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ కూడా పొందాయి. గతేడాది ప్రభాస్ హీరోగా రామయాణ ఇతిహాసంపై `ఆదిపురుష్` సినిమా తెరకెక్కింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో చడీ చప్పుడు లేకుండా మొదలైంది.
Ramayanam: వాల్మీకీ మహర్షి రాసిన రామాయణ మహా కావ్యం గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. మర్యాద పురోషత్తముడైన రాముడి గాథను ఎన్ని సార్లు విన్నా.. ఎన్ని సార్లు చూసినా.. ఎప్పటికీ నిత్య నూతనమే అని చెప్పాలి. బహుశా రామయాణంపై తెలుగులో వచ్చినన్ని సినిమాలు మరే ఇతర భాషల్లో రాలేదనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రామయాణ కావ్యంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. పూర్తిగా వక్రీకరించి తీయడంతో ఆదిపురుష్ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.. తాజాగా ఆ సంగతి పక్కన పెడితే.. మన చరిత్రకు సంబంధించిన పురాణాతిహాసాలపై ఎవరికీ పేటెంట్ హక్కులు ఉండవు. అందుకే ఎవరెన్ని సార్లు తెరకెక్కించిన ప్రేక్షకులు వాటిని ఆదిరస్తూనే ఉన్నారు. తాజాగా దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా.. సాయి పల్లవి సీతగా.. యశ్.. రావణాసురుడిగా రామాయణం సినిమా పట్టాలెక్కింది. ఈ పురాణ ఇతిహాసం కోసం మేకర్స్ ఎన్నో యేళ్లుగా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల స్క్రిప్ట్ రైటింగ్ పూర్తైయింది.
తెలుగులో ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు సమకూర్చారు. అయితే ఎట్టకేలకు శ్రీరామనవమికి కొన్ని రోజులు ముందు అనగా ఏప్రిల్ 2వ తేదిన రామయాణం సినిమా ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. భారీ జన సమూహం నేపథ్యంలో షూట్ చేస్తోన్న సీన్స్ కొన్ని రోజులు పాటు పిక్చరైజ్ చేయనున్నరారట. దేశంలోని దాదాపు 12 భాషల్లో మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను శ్రీరామనవమి రోజున ప్రకటించనున్నారు. ఏది ఏమైనా అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాల రాముడు కొలువైన ఈ శుభ సందర్భంలో ఈ సినిమా తెరకెక్కనుండటం శుభ పరిణామం.ఈ సినిమాను తెలుగు వాళ్లైన అల్లు అరవింద్, మధు మంతెనతో పాటు పలువురు బాలీవుడ్ నిర్మాతలు నిర్మాణ భాగస్వాములుగా రామాయణం సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ విషయానికొస్తే.. గతేడాది చివర్లో 'యానిమల్' మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అటు యశ్ కూడా కేజీఎఫ్ సిరీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఇంకోవైపు సాయి పల్లవి .. నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. మొత్తంగా ముగ్గురు యూనిక్ పర్సనాలిటీస్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook