Ramcharan & Chiru meets Amit Shah After after Winning Oscar 2023: ఆస్కార్ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్‌చరణ్: ఆర్ఆర్ఆర్ ప్రధాన నటుడు రామ్‌చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. గౌరవ సూచకంగా అమిత్ షాకు పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించారు. అదే సమయంలో అమిత్ షా.. రామ్ చరణ్‌ను అభినందనలు తెలిపి.. శాలువాతో సత్కరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్కార్ అవార్డు గెల్చుకున్న అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. 'నాటు నాటు' పాట హోరెత్తుతోంది. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఆస్కార్ గెల్చుకున్న అనంతరం ఆర్ఆర్ఆర్ ప్రధాన నటుడు రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు. గౌరవసూచకంగా అమిత్ షాకు పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో గౌరవించారు. అనంతరం అమిత్ షా రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపి.. శాలువాతో సత్కరించారు. త్వరలో రామ్‌చరణ్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారని తెలుస్తోంది. ఆస్కార్ గెల్చుకుని ఇండియా వచ్చిన తరువాత ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం అందుకున్నారు రామ్‌చరణ్. 


లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెల్చుకుని ఇండియాకు తిరిగొచ్చిన సందర్భంగా అభిమానులు భారీగా విమానాశ్రాయనికి చేరుకుని స్వాగతం పలికారు. బ్యానర్లు, పోస్టర్లతో సందడి చేశారు. అటు రామ్‌చరణ్ కూడా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికొస్తూ అభిమానుల్ని చిరునవ్వుతో పలకరించారు. కార్ టాప్ రూఫ్ నుంచి అభిమానులకు విష్ చేశారు. నాకు చాలా అనందంగా ఉందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, చంద్రబోస్ పట్ల గర్వంగా ఉందన్నారు. వీరి హార్డ్ వర్క్ కారణంగానే ఇండియాకు ఆస్కార్ వచ్చిందన్నారు. 


నాటు నాటుని భారతదేశ పాటగా రామ్‌చరణ్ అభివర్ణించారు. ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పశ్చిమం వరకూ ఆర్ఆర్ఆర్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read: Heavy Rains Alert: రాగల 72 గంటల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లో


Also Read: Allu Sneha Reddy Pics : వామ్మో అనిపించేలా పొట్టి బట్టల్లో బన్నీ భార్య.. అల్లు స్నేహారెడ్డి అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook