Ramcharan fans: ఒక పాన్ ఇండియా గురించి చూసిన ఎదురుచూపులు నిలిచిపోయాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ, ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆతృత పెరుగుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు పోటాపోటీగా సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా మూవీగా ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమ అభిమాన హీరోలను తెరపై చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


ఇద్దరు హీరోల అభిమానులు తమకు నచ్చిన స్టైల్లో ప్రమోట్‌ చేస్తూ సినిమాకు మరింత హైప్ పెంచేస్తున్నారు.  ఎన్టీఆర్‌ కోసం ఆయన ఫ్యాన్స్‌ కెనడాలో కార్లతో భారీ ర్యాలీ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టార్చ్‌ బేరర్‌ ఎన్టీఆర్‌ అంటూ కెనడా, యుఎస్‌ఏలో అభిమానులు చేసిన హంగామా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.


తాజాగా రామ్‌‌చరణ్‌ ఫ్యాన్స్‌ కూడా తగ్గేదేలే అంటున్నారు. ఎముకలు కొరికే చలిలో గంటకు 30 మైళ్ల వేగంతో ఈదురు గాలుల మధ్య పిట్స్‌బర్గ్‌లో రామ్‌చరణ్ అభిమానులు ప్లే కార్డ్స్‌తో హంగామా చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌.. టీమ్ రామ్‌చరణ్.. యూఎస్‌ఏ అంటూ పిక్స్‌ తీసి పోస్ట్ చేశారు. దాదాపు 15 కుటుంబాల సభ్యులు, పిల్లలు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలతోపాటు చెర్రీ పుట్టినరోజు కూడా ఇదే నెలలో ఉండడంతో అభిమానులు సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టేశారు. తారక్‌ ఫ్యాన్సే కాదు.. మేమూ హల్‌చల్‌ చేస్తామంటూ చరణ్‌ అభిమానులు పోటాపోటీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల ఉపాసనతో విహారానికి వెళ్లొచ్చిన మెగాపవర్ స్టార్.. ప్రమోషన్స్‌తో బిజీబిజీగా గడపనున్నాడు.


Also read: Naina Ganguly-Apsara Rani: సెగలు రేపనున్న నైనా గంగూలీ, అప్సర రాణి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook