Hyper Aadi Speech Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవిపై సోషల్‌మీడియాలో వస్తున్న ట్రోల్స్, విమర్శలపై నటుడు హైపర్ ఆది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అందర్ని తొక్కేశాడు అని వస్తున్న ప్రచారంపై బలంగా మాట్లాడాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో మాట్లాడిన హైపర్ ఆది విమర్శకులకు అదిరిపోయే రిప్లే ఇచ్చారు.
Ram Charan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఎంతో సెలబ్రిటీలతో పాటు సగటు అభిమాని కూడా ఎదురుచూస్తున్నాడు. అయితే చిరంజీవి పుట్టినరోజు నాడు ఆయన్ను ప్రత్యక్ష్యంగా చూసి శుభాకాంక్షలు తెలియజేయాలని ఎంతో ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో చిరంజీవి లేకపోవడం వల్ల ఆయన కుమారుడు రామ్ చరణ్ బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
Ram Charan in Irumudi: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ అయ్యప్ప పాటలో చరణ్ ప్రత్యేకంగా కనిపించనున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రామ్ చరణ్ టీమ్ ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. సినిమాలో చరణ్ ఎలాంటి గెస్ట్ రోల్ లేదా స్పెషల్ అప్పియరెన్స్ చేయడం లేదని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Ram Charan: టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు తెరకెక్కనున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్దితో బిజీగా ఉండగా.. దర్శకుడు సుకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Single screen closed: 2000 మిలీనియంకు ముందు వరకు తెలుగు సహా దేశ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రమే ఉండేవి. రాను రాను వీటి సంఖ్య తగ్గిపోతూ అదే ప్లేస్‌లో మల్టీప్లెక్స్ పెరుగుతూ పోతున్నాయి. ఇక సింగిల్ స్క్రీన్స్ మూసివేతకు స్టార్ హీరోలే కారణమా అంటే ఔననే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Allu Arjun:అల్లు అర్జున్, రామ్ చరణ్ ఉపయోగించిన ‘AP 40 LE 1’ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కారు ఎవరిది? ఈ నంబర్ ప్లేట్ వెనుక ఉన్న కథేంటి? సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
Directors Scripts Locked: కథలు రెడీగా ఉన్నాయి. అవును మన దగ్గర తెలుగు టాప్ దర్శకులందరు స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ హీరోలు మాత్రం ఖాళీగా లేరు. ఒక్క సుకుమార్ పరిస్థితే కాదు.. కొరటాల శివ.. లోకేష్ కనగరాజ్, సుజిత్ అందరు స్క్రిప్ట్ లాక్ చేసుకున్న హీరోలు బిజీగా ఉండటం మూలనా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ఇంకో కథను రెడీ చేసుకునే పనిలో పడ్డారు.
RC17 Movie Update:రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న RC17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అనసూయకు మరో కీలక పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా, నయనతార కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Korean Kanakaraju Trailer Out: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార రితికా నాయక్ కలిసి నటించిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానున్న నేపథ్యంలో సినిమాలో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
Ram Charan:పెళ్లికి ముందు ఉపాసన రామ్ చరణ్‌కు ఒక సరదా లవ్ టెస్ట్ పెట్టారట. హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే మోజంజాహి మార్కెట్‌కు తీసుకెళ్లాలని కోరగా, చరణ్ వెంటనే అంగీకరించారని చెప్పారు. అదే ఇంటర్వ్యూలో చరణ్‌కు ఇష్టమైన ఫుడ్, తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా ఉపాసన పంచుకున్నారు.
Ram Charan Surgery News: కథనాయకుడు రామ్‌చరణ్‌కు నిర్వహించిన మణికట్టు సర్జరీ విజయవంతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రామ్‌చరణ్ సతీసమేతంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది విజయంతో జోష్‌లో ఉన్న చరణ్, ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం RC17 వర్కింగ్ టైటిల్‌తో ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర ప్రచారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Mega Family:తెలుగు సినీ పరిశ్రమలో ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై మళ్లీ చర్చ మొదలైంది. నిర్మాత నట్టి కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లు, మెగా ఫ్యామిలీ వైఖరి, అలాగే పెద్ది సినిమా విజయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
Ram Charan New Age Megastar: గ్లోబల్ స్టార్ నుంచి న్యూ ఏజ్ మెగాస్టార్‌గా రామ్ చరణ్ మారిపోతున్నాడు. పెద్ది మూవీ సక్సెస్ మీట్లో చిరంజీవి కామెంట్స్ తరువాత ఇప్పుడు టైటిల్ మార్పుపై పెద్ద చర్చ జరుగుతోంది. తరువాత సినిమా నుంచి రామ్ చరణ్ పేరు ముందు న్యూ ఏజ్ మెగాస్టార్ బిరుదు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Peddi collections: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఆర్ఆర్ఆర్ తర్వాత సరైన సక్సెస్ లేని రామ్ చరణ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయినా.. రామ్ చరణ్‌లో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మాత్రం వెంటాడుతుంది.
Ram Charan-Upasana: ఇన్నాళ్లూ ప్రైవసీ కారణంగా దాచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనల కుమార్తె క్లీంకార ముఖాన్ని ఎట్టకేలకు అభిమానుల ముందుకు తెచ్చారు. పాప పుట్టినరోజు సందర్భంగా చరణ్ దంపతులు తొలిసారి తమ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. ఇందులో నవ్వుతూ మెరిసిపోయిన మెగా ప్రిన్సెస్‌ను చూసి.. అచ్చం నాన్న పోలికలేనంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Peddi Reloaded Version: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో అదనంగా కొన్ని యాడ్స్ చేసారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.
Mega Father and Son Unique Records: ఒక కాలండర్ ఇయర్ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్‌లు తమ సినిమాలతో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. అవును తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ సినీ చరిత్రలో న భూతో న భవిష్యత్ అని చెప్పాలేమో.
Peddi Vs MSVP: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.. తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు నటన విషయంలో చిరంజీవిని బీట్ చేస్తున్నాడు. తాజాగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాతో తండ్రి మన శంకర వర ప్రసాద్ గారు’ లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేయడం విశేషం.
Peddi Collection Day 10: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. సినిమా విడుదలై 10 రోజులైనా ప్రేక్షకుల తాకిడి తగ్గట్లేదు. 10 రోజుల్లో ఈ చిత్రం రూ.378 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.
Janhvi Kapoor:రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా జాన్వీ తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Janhvi Kapoor Peddi Remuneration: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'పెద్ది'. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్‌కి చేరిన ఈ చిత్రం.. ఇటీవలే హీరోయిన్ పాత్ర గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె పాత్రకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని విపరీతమైన చర్చ జరుగుతోంది.