Vyooham Movie: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితం నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో అందరికీ తెలిసిందే అయినా..ఏయే పాత్రల్ని ఎలా చూపించారనేది ఆసక్తి రేపుతోంది. ఇది కూడా ఓ వ్యూహంలా కన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్జీవీ అప్‌కమింగ్ సినిమా వ్యూహం టీజర్, పోస్టర్లు అంచనాల్ని మరింతగా పెంచేశాయి. రెండు భాగాల్లో నిర్మిస్తున్న ఈ సినిమా మొత్తం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఉంటుంది. ఇందులో మొదటి భాగాన్ని ఈ ఏడాది, రెండవ భాగాన్ని 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ లక్ష్యంగా సాగిన కుట్రలు, 2009 నుంచి 2014 వరకూ ఏం జరిగింది. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఒక్కొక్కరినీ ఎండగడుతూ సాగుతుంది. ఇప్పుడీ సినిమా రెండవ టీజర్ విడుదలై అందులోని పాత్రల గురించి చర్చ జరిగేలా చేస్తోంది. ఈ టీజర్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ, విజయమ్మ పాత్రల్ని ఆసక్తిగా చూపించడం గమనించవచ్చు.


ఇదే సమయంలో వ్యూహం సినిమాపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత చర్చ రేపుతున్నాయి. టీడీపీలో అందరికీ బట్టలు విప్పడం బాగా తెలుసని..అందుకే ఈసారి తాను అవతలి పార్టీల బట్టలు విప్పి చూపిస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు తీయిస్తున్నారా అంటే లేదని..తన ఇష్టంతో తీస్తున్నానని చెప్పాడు. వైఎస్ జగన్ గురించి వాస్తవం ప్రజలకు చూపించాలని..తాను నమ్మిన నిజాన్ని నలుగురికీ చెప్పేందుకు తీశానని అన్నారు. ఈ నిజం గురించి ఆధారాలు కూడా సినిమాలో చూపిస్తానన్నారు. 


తనకు జగన్ అంటే ఇష్టమని.. అయితే ఈ సినిమాతో జగన్‌కు అనుకూలంగానో లేదా చంద్రబాబుకు వ్యతిరేకంగానో చేయడం ఉద్దేశ్యం కాదన్నారు. తనకు తెలిసింది, రాజకీయాల్లో జరిగిన నేపధ్యాన్ని గురించి కథ రాసుకొచ్చినట్టు చెప్పారు. 20089 నుంచి 2014 వరకూ, తిరిగి 2014-2019 వరకూ అసలేం జరిగింది, వైఎస్ జగన్ లక్ష్యంగా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు సాగాయనేది ప్రజలకు చెప్పడమే తన సినిమా లక్ష్యమని..ఎవరినీ టార్గెట్ చేసేది కాదని చెప్పుకొచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook