Project K Movie: ప్రాజెక్ట్ `K` తో బాహుబలి రికార్డులు అవుట్: రానా కామెంట్స్ వైరల్
Rana Comments on Prabhas Project `K` Movie: ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి రానా తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ తీస్తోన్న ప్రాజెక్ట్ కే గురించి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని, అది కచ్చితంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని రానా చెప్పుకొచ్చాడు.
Rana Daggubati Comments on Prabhas Project 'K' Movie: ప్రభాస్ సినిమాలిప్పుడు వరుసపెట్టి వస్తున్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో టైపులో హైప్ ఉంది. ఆదిపురుష్ కోసం ప్రపంచం అంతా కూడా వెయిటింగ్. ఇక ప్రాజెక్ట్ కే అయితే యూనివర్స్ మూవీ అని చెబుతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సందీప్ వంగా తీసే స్పిరిటి కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే ఉంటుందట. సిద్దార్థ్ ఆనంద్ తీసే సినిమా సైతం అదే రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇక మారుతితో తీసే సినిమానే లోకల్ అని తెలుస్తోంది.
ప్రభాస్ ఈ నెలలోనే ఆదిపురుష్ అంటూ రాబోతోన్నాడు. ఆదిపురుష్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ రాముడి పాత్రలో అందరినీ మెప్పించబోతోన్నాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మారుతి కాంబోతో బాక్సాఫీస్ వద్ద సందడి ఉండనుంది. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
రానా తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ కే గురించి చెప్పాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటనుందని చెప్పాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని అన్నాడు. ఈ సినిమా కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని అన్నాడు. మొత్తానికి ప్రాజెక్ట్ కే గురించి రానా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!
ప్రాజెక్ట్ కే అనేది సైన్స్ ఫిక్షన్ అని కొందరు, టైమ్ మిషన్ బేస్డ్ స్టోరీ అని ఇంకొందరు ఇలా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ కొత్త యూనివర్స్‌నే క్రియేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మహానటి తరువాత నాగ్ అశ్విన్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook