Rana Daggubati: రానా పేరు చెప్పగానే అందరికీ బాహుబలిలో బల్లాలదేవుడు గుర్తుకొస్తాడు. ఆయన బాహుబలి సినిమాతో సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తన బాడీ లూస్‌తో ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా రానా సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.  పెద్ద సినిమాల కారణంగా సోషల్ మీడియాపై టైం స్పెండ్ చేయలేకపోతున్నారని తెలిపారు. అయితే ఇటీవల రానా దగ్గుబాటి ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన సోషల్ మీడియాలో దూరంగా ఉండటం నిజమే.. కానీ అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో తనకు సంబంధించిన  వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునేవారు. ఇటీవల ఆయన ఇంస్టాగ్రామ్‌లోని పోస్టులన్నీ డిలీట్ చేయడంతో పలు అనుమానాలకు రేకెల్లుతున్నాయి. డిలీట్ గల కారణాలను.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా షేర్ చేశారు.. వర్క్ నడుస్తుందని.. అందువల్లే సోషల్ మీడియాకు కాలం కేటాయించుకోలేనని.. మంచి సినిమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.



 



అయితే ట్విట్టర్‌కు కూడా దూరంగా ఉంటాడా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు రానా ఫ్యాన్స్. కేవలం బిజీగా ఉండడం వల్లే రాలేకపోతున్నారా..? లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చని సినీ వర్గాల్లో టాక్. ఏదేమైనా ఈ నిర్ణయం మాత్రం ఫ్యాన్సుకు నిరాశపరిచేదే.  విరాటపర్వంతో తెలుగు చిత్ర రంగంలో మంచి పేరు తెచ్చుకున్న రానా.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ ఈ సిరీస్ పై ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలుబడునుంది.


Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.


Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712