PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు..ఎవరు, నేపధ్యమేంటి

PM Modi and Pak Sister: దేశ ప్రధాని నరేంద్రమోదీకు పాకిస్తాన్‌లో ఓ చెల్లెలుంది. ఆ చెల్లెలు ప్రతియేటా క్రమం తప్పకుండా రాఖీ పంపిస్తుంటుంది. ఇలా 25 ఏళ్లుగా జరుగుతోంది. ఆ చెల్లెలెవరు, బంధం ఎలా ఏర్పడిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2022, 04:59 PM IST
PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు..ఎవరు, నేపధ్యమేంటి

PM Modi and Pak Sister: దేశ ప్రధాని నరేంద్రమోదీకు పాకిస్తాన్‌లో ఓ చెల్లెలుంది. ఆ చెల్లెలు ప్రతియేటా క్రమం తప్పకుండా రాఖీ పంపిస్తుంటుంది. ఇలా 25 ఏళ్లుగా జరుగుతోంది. ఆ చెల్లెలెవరు, బంధం ఎలా ఏర్పడిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నా చెల్లెళ్ల, సోదర సోదరీమణుల బంధానికి, అనురాగానికి ప్రతీక రక్షాబంధన్. రక్షాబంధన్ రోజున సోదరుడి దీర్ఘాయుష్షు కోరుతూ సోదరి రాఖీ కడుతుంది. అందుకు ప్రతిగా ఆ సోదరుడు సోదరికి రక్షణగా నిలిచే హామీ ఇస్తాడు. సోదర సోదరీమణులు దూరంగా ఉంటే మాత్రం పోస్ట్ ద్వారా రాఖీలు పంపించడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకు కూడా శత్రుదేశం పాకిస్తాన్‌లో ఓ చెల్లెలుంది. ఆ చెల్లెలి పేరు ఖమర్ మొహ్సిన్ షేక్. క్రమం తప్పకుండా నరేంద్ర మోదీకు రాఖీ పంపిస్తోంది. ఈసారి కూడా రాఖీ పంపించింది ఆ చెల్లెలు. రాఖీ పంపిస్తూ..2024 ఎన్నికలకు శుభాకాంక్షలు అందించింది.

ఖమర్ మొహ్సిన్ షేక్ ప్రధాని మోదీకు రాఖీతో పాటు ఓ లేఖ కూడా పంపించింది. 2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని కావాలని ఆకాంక్షించింది. ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్ధించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్ధన చేసింది. నరేంద్రమోదీ అందుకు అర్హులని ఆమె తెలిపింది. 

ఎవరీ ఖమర్ మొహ్సిన్ షేక్

ఖమర్ మొహ్సిన్ షేక్ గత 25 ఏళ్లుగా ప్రధాని మోదీకు రాఖీ కట్టడమో లేదా పంపించడమో చేస్తోంది. ఈసారి కూడా రాఖీ పంపించింది. ప్రధాని మోదీకు తొలిసారి రాఖీ కట్టింది ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నప్పుడని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈసారి తనను ఢిల్లీకు పిలిపిస్తారని ఆశిస్తున్నట్టు..పాకిస్తాన్‌కు చెందిన ఖమర్ మొహ్సిన్ షేక్ వెల్లడించింది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని..రేష్మీ దారంతో రాఖీ స్వయంగా తయారు చేశానని చెప్పారు. ఖమర్ మొహ్సిన్ షేక్ ఓ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఇండియాలోనే ఉంటోంది. ఖమర్ భర్త గుజరాతీ యువకుడు. 1981లో తొలిసారి కుటుంబంతో సహా అహ్మాదాబాద్‌కు చేరుకుంది. 

మోదీ, ఖమర్ మధ్య బంధం ఎప్పటిది

1995లో అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింహ్‌ను మొహ్సిన్ కలిశారు. ఆప్పుడా సమయంలో నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. డాక్టర్ స్వరూప్ సింహ్ ఖమర్ మొహ్సిన్‌ను కుమార్తెగా భావించేవారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని గవర్నర్ స్వరూప్ సింహ్...నరేంద్ర మోదీని కోరారు. వెంటనే మోదీ..మీకు కుమార్తె అయితే..నాకు సోదరి లాంటిదని చెప్పారని ఖమర్ మొహ్సిన్ చెప్పారు. 1996 నుంచి మోదీకు రాఖీ కడుతోంది. 

ఖమర్ మొహ్సిన్ షేక్..నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాఖీ కట్టేది. ఆ సందర్భంలో చాలాసార్లు ప్రధాని మోదీని కలిసింది. అది కూడా ఏ విధమైన అప్పాయింట్‌మెంట్ లేకుండా.

Also read: Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్..మరోసారి జ్యుడిషియల్ కస్టడీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News