Rajinikanth Upcoming Movie: ఇట్స్ అఫీషియల్... రజినీ 170వ చిత్రంలో రానా..
Rana in Rajni Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నయా మూవీలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నటించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు మేకర్స్.
Rana in Thalaivar 170: జైలర్ తో సక్సెస్ బాట పట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జైభీమ్ ఫేమ్ T.G.జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నాడు. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రూపొందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది రజినీకాంత్‍కు 170వ సినిమా. ప్రస్తుతం ఈ మూవీని తలైవర్ 170 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్‌లు భాగం కాగా.. తాజాగా ఈ ప్రాజెక్టులోకి భళ్లాల దేవుడు రానా దగ్గుబాటి కూడా చేరాడు. దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది లైకా ప్రొడక్షన్స్.
''సూపర్ కూల్ టాలెంట్ దగ్గుబాటి రానాకు తలైవర్ 170లోకి స్వాగతం చెబుతున్నాం. డ్యాషింగ్ రానా రాకతో తలైవర్ 170 మరింత ఆకర్షణీయంగా మారింది'' అని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. మరోవైపు ఈ ప్రాజెక్టులోకి మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కూడా చేరారు. ఈ విషయాన్ని కూడా లైకా ప్రొడక్షన్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. రానా, ఫాహద్ ఈ మూవీలో భాగం కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇందులో దసరా విజయన్, రితికా సింగ్, మంజు వారియర్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. మరోవైపు ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తారనే వార్తలు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook