ఇంట్లో కూర్చునే Rana Daggubati పెళ్లి చూసిన నాని
రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి వేడుక ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) అంగరంగ వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి కుటుంబం, మిహీకా బజాజ్‌ల కుటుంబాలకు అత్యంత సమీప బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి వేడుక ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) అంగరంగ వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి కుటుంబం, మిహీకా బజాజ్‌ల కుటుంబాలకు అత్యంత సమీప బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రానా ఆత్మీయులు నాగచైతన్య, సమంత, సన్నిహితమిత్రులు రాంచరణ్, ఆయన సతీమణి ఉపాసన కొనిదెల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇంకా ఎంతో మంది సన్నిహితమిత్రులు, సమీప బంధువులను రానా తన పెళ్లికి ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ కొవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనల ( COVID-19 guidelines ) కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో రానా పెళ్లిని చూడాలని కోరుకున్న మిత్రులు, రానా నుంచి వర్చువల్ రియాలిటీ లింకు అందుకున్న మిత్రులు రానా పెళ్లి వేడుకను వర్చువల్ రియాలిటీ వ్యూ ద్వారా వీక్షించారు. Also read : రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి ఫోటోలు
రానా దగ్గుబాటి పెళ్లి వేడుకను వర్చువల్ రియాలిటీ ( Virtual reality ) ద్వారా వీక్షించిన వారిలో ప్రముఖ సినీనటుడు న్యాచురల్ స్టార్ నాని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి వంటి వారు ఉన్నారు. నాని, అనిల్ రావిపూడి వర్చువల్ రియాలిటీ ద్వారా రానా వెడ్డింగ్ సెరెమనీని వీక్షిస్తూ ఆ చిత్రాలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Also read : యుజ్వేంద్ర చాహల్ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ ఫోటోలు.. చాహల్ గాళ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా ?