Virata Parvam Day 2 Collections: టాలీవుడ్ భళ్లాలదేవుడిగా  పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా - సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన తాజాచిత్రం  చిత్రం 'విరాట పర్వం'. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో దగ్గుబాటి రానా - సాయి పల్లవి మాత్రమే కాక నివేదా పేతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, సాయి చంద్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. మొదటి రోజే విరాటపర్వం కలెక్షన్స్ ఆశించిన మేర రాలేదు అనుకుంటే రెండో రోజు కూడా ఆశించిన మేర రాలేదు. 'విరాట పర్వం' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు గట్టి ఎదురు దెబ్బే తగిలింది.  


ఈ సినిమాకు రెండో రోజు నైజాం రూ. 34 లక్షలు, సీడెడ్‌ రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 3 లక్షలు, గుంటూరు రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరు రూ. 2 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. అంటే మొత్తం లెక్కలేస్తే రెండు రాష్ట్రాల్లో రూ. 63 లక్షల షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.  2 రోజులకు కలిపి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.53 కోట్ల షేర్, రూ. 2.50 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.  అయితే సాయి పల్లవి కామెంట్స్ వల్లే సినిమా మీద నెగటివ్ ట్రెండ్ నడిచి ఆ ఎఫెక్ట్ వసూళ్ళ మీద పడిందని అంటున్నారు. 
 
ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజులకు  2.27 షేర్‌తో పాటు రూ. 3.90 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు చ్సింది. నిజానికి 'విరాట పర్వం' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 'విరాట పర్వం' మొత్తంగా రూ. 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.  ఇక 14 కోట్ల బిజినెస్ కావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14.50 కోట్లని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2 రోజుల్లో 2.27 కోట్లు వచ్చాయంటే మరో 12.23 కోట్లు వస్తేనే సినిమా హిట్ స్టేటస్‌ చేరుతుంది. టాక్ బాగానే ఉన్నా ఈ కలెక్షన్స్ చూస్తుంటే షాకింగ్ గా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు .
 
 Also Read:Thalapathy Vijay : ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన పరోటా?


Also Read:Vikram : ఐదేళ్లకు బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన తమిళ సినిమా.. కానీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook