Ranbir Kapoor-Alia Bhatt Daughter Pics Viral: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor )‌, ఆలియాభట్‌ (Alia Bhatt) దంపతులు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. క్రిస్మస్‌ (Christmas) సందర్భంగా తమ గారాల పట్టి రహా (Raha)ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో రహా వైట్‌ ఫ్రాక్‌లో ఎంతో అందంగా కనిపించింది. ఆలియా కూతురుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలియా-రణ్‌బీర్‌ వివాహం గతేడాది ఏప్రిల్‌14న ఘనంగా జరిగింది. ముంబైలో అత్యంత సన్నిహితులు, సెలబ్రెటీల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. అయితే పెళ్లైన రెండు నెలలకే తను ప్రెగ్నెంట్ అని ఆలియా షాక్ ఇచ్చింది. అయితే అదే ఏడాది నవంబరు 06న ఆలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు రహా అని పేరు పెట్టారు. ఈ జంట అప్పటి నుంచి చిన్నారి ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేదు. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 



ఈ ఏడాది రణ్‌బీర్‌ 'యానిమల్' సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. ఇందులో రణ్‌బీర్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ చిత్రం హౌస్ పుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఆలియా ఈ ఏడాది 'రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. 


Also Read: Salaar First Week Collections: మొదటివారం సలార్ కలెక్షన్స్... బ్రేక్ ఈవెన్ కి ఎంత రావాలంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి