Salaar First Week Collections: మొదటివారం సలార్ కలెక్షన్స్... బ్రేక్ ఈవెన్ కి ఎంత రావాలంటే..

Salaar Box-office Collection Day 3: మళ్లీ మన ప్రభాస్ మానియా మొదలైంది. మన వాడి.. సలార్ సినిమా బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తోంది. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. తొలిరోజు వసూళ్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ మొత్తానికి మొదటివారం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోయింది. ఇంతకీ మొదటివారం 3 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఈ సినిమాకి ఎంత రావాలి? ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 02:51 PM IST
Salaar First Week Collections: మొదటివారం సలార్ కలెక్షన్స్... బ్రేక్ ఈవెన్ కి ఎంత రావాలంటే..

Salaar Break-even: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తోంది. మొదటిరోజు మొదటి షో తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం మొదటి వారం మొత్తం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన తొలి రెండు రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించిన సలార్ మూడో రోజు కూడా అదే హవా కొనసాగించనుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

సలార్ ఫస్ట్ డే వసూళ్ల విషయానికి వస్తే.. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్రం రూ.  178 కోట్ల గ్రాస్‌ను అందుకోగా.. ఇదే విషయాన్ని తెలుపుతూ  సలార్ టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అందులోనూ నైజాంలో  అదరగొట్టింది. నైజాంలో ఈ చిత్రం అక్షరాలా 22.55 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకుని సంచలనం క్రియేట్ చేసింది. నైజాంలో సలార్ కంటే ముందు ఆర్ ఆర్ ఆర్ పేరు మీద ఆల్ టైమ్ రికార్డ్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజున 23.35 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకుంది. ఇక రెండోవ స్థానంలో సలాడ్ సినిమా నిలిచింది. యుఎస్ లో కూడా సలార్ కలెక్షన్స్ సునామీ సృష్టించింది.

ఇక సలార్  రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి మొదటిరోజు రూ. 50.29 కోట్లు సంపాదించగా రెండో రోజు మాత్రం కొంచెం తగ్గి రూ. 21.23 కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తం పైన రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కలిపి రూ. 71.52 కోట్ల షేర్ (రూ. 104.65 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక మొత్తం పైన ఈ చిత్రం రెండు రోజులు ముగిసే సరికి రూ. 295.7 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది.

కాగా నిన్న ఆదివారం కూడా ఈ చిత్రం అన్ని ఏరియాల్లో సత్తా చాటింది.  మొత్తం పైన 3 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. సీడెడ్ (రాయలసీమ) - రూ. 12.65 కోట్లు,‌నైజాం (తెలంగాణ) - రూ. 44.57 కోట్లు..కృష్ణ - రూ. 4.80 కోట్లు,‌ తూర్పు గోదావరి - రూ. 7.31 కోట్ల, ఉత్తరాంధ్ర - రూ. 9.77 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 4.72కోట్లు, గుంటూరు - రూ. 6.82 కోట్లు, నెల్లూరు- రూ. 3.30 కోట్లు.. సంపాదించగా మొత్తం పైన తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ..3 రోజుల్లో రూ. 93.92 కోట్ల షేర్ (రూ. 140.30 కోట్ల గ్రాస్) దక్కించుకుంది.

ఇక కర్ణాటక లో రూ. 13.35 కోట్లు, తమిళనాడు లో రూ. 5.80 కోట్లు, కేరళ లో రూ. 4.05 కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ లో 29.75 కోట్లు,‌ ఓవర్సీస్ లో రూ. 38.80 కోట్లు సంపాదించి ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ. 185.67 కోట్ల షేర్ (రూ. 330.00 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

కాగా విడుదలకు ముందు సలార్ సినిమా ఎన్నో అంచనాలతో రాగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రూ. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా రూ. 161.33 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. అయితే సినిమాకి వస్తున్న స్పందన బటి చూస్తే ఈ వస్తువులు ఈ చిత్రం సాధిస్తుంది అని అందరూ అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా సోమవారం క్రిస్మస్ సెలవ కావడంతో.. రెండో వారం మొదటి రోజు కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే జోరు కొనసాగించడం ఖాయం.

ఇక ఈ సినిమా  ప్రభాస్‌కు 5వ రూ. 200 కోట్ల గ్రాస్ మూవీ గా ..3వ 300 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచింది. 

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News