Animal World Television Premier: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిన రణ్‌బీర్ `యానిమల్`.. ఎపుడు.. ఎక్కడంటే..
Animal World Television Premier: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలై అందరి అంచనాలకు తగ్గట్టు భారీ వసూళ్లనే సాధించింది. సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్ కలగలసి ఈ మూవీ మంచి విజయాన్నే సాధించింది. ఇప్పటికే ఓటీటీ వేదికగా దుమ్ము లేపిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.
Animal World Television Premier: తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండతో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీతో సంచలన విజయం సాధించారు. బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో పాటు తాజాగా యానిమల్ మూవీలతో రచ్చ లేపాడు.ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న భారీగా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాదు ఈ మూవీని రణబీర్ మార్క్ యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు. ఇందులో రణబీర్ కపూర్‌ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మరోవైపు ఈ సినిమాను 3 గంటలకు పైగా సాగదీయడం కొంచెం ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్‌గా మాస్ ప్రేక్షక లోకం ఈ సినిమాకు సాహో అంటూ సలాం కొట్టింది. ఈ మూవీ రణబీర్ కపూర్ హీరోయిజంతో పాటు బాబీ దేవోల్ విలనిజం.. అనిల్ కపూర్ యాక్టింగ్.. రష్మిక ఎమోషనల్ యాక్టింగ్.. తృప్తి దిమ్రీ హాట్ సీన్స్ వెరసి ఈ సినిమా గతేడాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
జవాన్, పఠాన్, గదర్ 2 మూవీల తర్వాత సెన్సేషన్ హిట్‌గా నిలిచింది యానిమల్ మూవీ. ఈ సినిమా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ మూవీ మరో సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ఈ మూవీ మన దేశంలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన సినిమాగా సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓటీటీలో ఇది ఓ రికార్డు అని చెబుతున్నారు. అంతేకాదు నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లలతో ఈ సినిమా 3 స్థానంలో నిలిచి భారతీయ ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఈ సినిమా మార్చి 17 సోనీ మాక్స్ ఛానెల్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతోంది.
మొత్తంగా థియేట్రికల్‌గా.. ఓటీటీ వేదికగా సూపర్ సక్సెస్ అయిన యానిమల్ మూవీ టీవీల్లో ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి. ఇక యానిమల్ ఊమీవ వరల్డ్ వైడ్‌గా వసూళ్ల సాధించిదంటే..
మిక్స్‌డ్ రివ్యూస్‌తో 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.37.20 కోట్ల షేర్ (రూ. 73.50 కోట్ల గ్రాస్) సొంతం చేసుకుంది. డంకీ, సలార్ మూవీల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఓవరాల్‌గా ఈ మూవీ టోటల్ రన్‌లో రూ. 502 కోట్ల పైగా నెట్ వసూళ్లను సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాలు.. రూ. 73.50 కోట్ల గ్రాస్..
తమిళనాడు.. రూ. 10.40 కోట్ల గ్రాస్..
కర్నాటక.. రూ. 36.75 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 4.90 కోట్ల గ్రాస్..
రెస్ట్ ఆఫ్ భారత్ -... రూ. 533.80 కోట్లు గ్రాస్..
ఓవర్సీస్.. రూ. 253.70 కోట్ల గ్రాస్..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 913.05 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది.
ఓవరాల్‌గా ఈ మూవీ అన్ని అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.తెలుగులో చూపించి జోరు తమిళం, మలయాళంలో పెద్దగా చూపించలేకపోయింది. సందీప్ రెడ్డి వంగా వంటి తెలుగు దర్శకుడు కావడం వల్ల తెలుగులో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టింది. లేకపోతే.. ఈజీగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరి ఉండేది. ఏది ఏమైనా 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనమే రేపింది.
Also read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter