COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ranbir Kapoor’s car suffers from accident: రణబీర్ కపూర్ నటించిన షంషేరా సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌లో, రణబీర్ కపూర్ మొదటిసారిగా డెకాయిట్ పాత్రలో కనిపించాడు.  అయితే షంషేరా లాంచ్ ఈవెంట్‌కి వస్తున్న క్రమంలో రణబీర్ కపూర్ ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది. రణబీర్ కపూర్ చాలా టెన్షన్ తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చారు.  ఈ విషయం మీద రణబీర్ కపూర్‌ను ఒక ప్రశ్న అడగగా, దానికి సమాధానంగా, తన ట్రైలర్ లాంచ్‌కు ముందు ప్రమాదం జరిగిందని చెప్పారు. 


'షంషేరా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వస్తుండగా మార్గమధ్యంలో ఆయన కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో అతని కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కారులో ఉన్న రణబీర్ కు గాయాలు ఏమి కాకపోవడంతో ఆయన ఆ టెన్షన్ తోనే లాంచ్ ఈవెంట్ కు వచ్చారు. తమ అభిమాన హీరో కారుకు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకున్నా, అందులో ఆయనకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రణబీర్ కపూర్ హీరోగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షంషేరా’ జూలై 22న  రిలీజ్ కానుంది. 


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ డెకాయిట్ షంషేరా పాత్రలో నటిస్తున్నాడు. మరో వైపు సంజయ్ దత్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వాణి కపూర్ రణబీర్‌తో రొమాన్స్‌ చేయనుంది. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.  ఈ చిత్రానికి డైలాగులు పీయూష్ మిశ్రా రాశారు. ఈ చిత్రానికి సాహిత్యాన్ని పీయూష్ మిశ్రా, మిథున్ మరియు కరణ్ మల్హోత్రా అందించారు. ఈ చిత్రం జూలై 22న థియేటర్లలోకి రానుంది.


Also Read:Megastar Chiranjeevi 154 for Sankranthi: మేనల్లుడికి పోటీగా చిరంజీవి..


Also Read: Karthikeya 2 Trailer: అసలు కృష్ణుడు ఏంటి.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.