టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కాంభినేషన్‌లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రంగ్ దే సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. కరోనాతో టాలీవుడ్ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. థియేటర్లు మూతపడితే ఓటీటీకి సై అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రంగ్ దే సినిమా (Rang De Movie) గురించి మరో అప్‌డేట్ వచ్చింది. నితిన్ (Actor Nithiin), కీర్తి సురేష్ తొలిసారి జతకట్టిన ఈ సినిమా ఓటీటీ వేదికగా మీ ముందుకు రానుంది. కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ లాంటి వాటితో అలసిపోయిన టాలీవుడ్ ప్రేక్షకులకు రంగ్ దే మూవీ వినోదాన్ని పంచనుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జీ5 (ZEE5) యాప్‌లో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. జూన్ 12 నుంచి స్క్రీనింగ్ కానుందని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ తెలిపింది. ఈ మేరకకు ట్వీట్ చేసింది.


Also Read: SVP first look: Mahesh Babu ఫ్యాన్స్‌కి తప్పని డిజ్పపాయిట్‌మెంట్



రంగ్ దే తరువాత నితిన్ నటించిన చెక్ మూవీ సైతం ఇటీవల విడుదలైంది. అంతకుముందు కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన మిస్ ఇండియా సినిమా ఓటీటీ వేదికగా వచ్చి కరోనా సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులకు అలరించింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవల ఆమె కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అర్హులైన వారిని టీకాలు తీసుకోవాలని కోరారు.


Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook