Rashi Singh: శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'భూతద్దం భాస్కర్ నారాయణ'. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. పురుషోత్తం దాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్నేహాల్, శశిధర్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మార్చి 1న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రాశి సింగ్ మీడియాతో పలు అంశాలతో పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడిందంటే.. ?


మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉద్యగం కూడా చేశాను. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చిన్నప్పుడే హీరోయిన్ అయిపోదామనుకున్నాను. చాలా హార్ట్ వర్క్ చేస్తే కానీ ఈ సినిమాలో అవకాశం రాలేదు.  
లాస్ట్ ఇయర్ సంతోష్ శోభన్ తో నటించిన ప్రేమ్ కుమార్ లాస్ట్ ఇయర్ రిలీజైంది. ఆహా లో పాపం పసివాడు చేశాను.  ఇప్పుడు శివ కందుకూరి గారితో  'భూతద్ధం భాస్కర్ నారాయణ' లో నటించాను. మేము మొదట్లో ముంబైలో వుండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చాము. టాలీవుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ నాకు చాలా నచ్చింది. తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకున్నాను.


భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రాజెక్ట్ లోకి అవకాశం ఎలా వచ్చిందంటే.. ?
ఈ సినిమా హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ మూవీ ఆడిషన్ కి వెళ్ళాము. డైరెక్టర్ గారు అనుకున్న పాత్రలో నన్ను పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకొని తీసుకున్నారు.  


ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో నా పాత్ర  పేరు లక్ష్మీ, మీ మధ్య ఉన్న క్యారెక్టర్.  ఈ కథ విన్నప్పుడు షాకింగ్ అనిపించింది. చాలా బలమైన పాత్ర నాది. ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. ఇందులో రిపోర్టర్ పాత్రలో నటించాను. తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఇందులో ఉంది. క్లైమాక్స్ ని చివరి వరకూ ఎవరూ గెస్ చేయని పాత్ర. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.  ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేసినందుకు చాలా గర్వంగా వుంది.


హీరో శివ కందుకూరి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
శివ చాలా మంచి వ్యక్తి. చాలా వినయంగా, ఓపికగా వుంటారు. వాళ్ళ నాన్న పరిశ్రమలో  నిర్మాత. అయినప్పటికీ ఏ రోజు  ఆ యాటిట్యూడ్ కనిపించదు. అందరినీ సమానంగా చూస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుందన్నారు.


దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?  
పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. విజన్ ఉన్న దర్శకుడు.  సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నా పాత్ర అందరికీ నచ్చుతుంది.


నిర్మాతల గురించి ?  
చాలా యంగ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటే అభిమానంతో పాటు ప్యాషన్ ఉంది. చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజీపడకుండా ఖర్చు చేసి గ్రాండ్ గా నిర్మించారు.


ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్ర భిన్నమైనదే. రాబోయే ప్రసన్న వదనం సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. అన్ని పాత్రల్లో నటించి మెప్పించాలనేదే నా డ్రీమ్.   


తెలుగులో  మీ ఫేవరేట్ హీరో ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆయన అభిమాని అయిపోయాను. ఆయన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించడం కొత్తగా అనిపిస్తుంటుంది.


కొత్తగా రాబోతున్న చిత్రాలు ?
సుహాస్ గారితో చేసిన 'ప్రసన్న వదనం' అతి తొందరలో ఆడియన్స్  ముందుకు రాబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.


Read More: Rashmika-Vijay Devarakonda: ‘నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను’.. రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook