Anchor Rashmi : వాడి లవర్ వాడి ఇష్టమంటా.. నాగ శౌర్య వీడియోపై యాంకర్ రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్
Naga Shaurya Video నాగ శౌర్య వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రాంక్ వీడియోనా? సినిమా ప్రమోషన్స్ కోసం చేశారా? నిజంగా జరిగిన ఘటనా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ వీడియో మీద సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.
Rashmi Fires on Naga Shaurya Video నాగ శౌర్య నిన్న రోడ్డు మీద హీరోయిజం చూపించాడు. ఓ యువకుడు తన లవర్‌ను రోడ్డు మీద కొట్టాడు. దీంతో నాగ శౌర్య కారులోంచి దిగి హీరోయిజం చూపించాడు. నీ లవర్ అయితే కొడతావా? సారీ చెప్పు.. అసలు ఎందుకు కొట్టావ్ అంటూ రోడ్డు మీదే నిలదీశాడు నాగ శౌర్య. అయితే ఇది సినిమా ప్రమోషన్స్ కోసం చేసిందా? లేదా? నిజంగానే జరిగిన ఘటన అన్నది తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చర్చకు దారి తీస్తోంది.
సదరు యువకుడ్ని కొట్టడం, నిలదీయడం తప్పని కొంత మంది అంటుంటే.. వాడ్ని అలానే కొట్టాలంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆడపిల్లల మీద చేయిజేసుకోవడం ఏంటి? అని నిలదీస్తున్నారు. వాడి లవర్ వాడి ఇష్టం మధ్యలో మనం వెళ్లడం ఎందుకు అని మరి కొందరు అంటున్నారు. ఇదే ఓ మగాడ్ని ఆడది కొడితే ఇలానే స్పందించేవారా? అని అడుగుతున్నారు.
ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లను చూసిన రష్మికి ఒళ్లంతా మండినట్టుంది. దీంతో సదరు నెటిజన్ల ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి కడిగి పారేసింది. వాడి లవర్ వాడి ఇష్టం అంటా.. అమ్మాయే సపోర్ట్ చేస్తోందిగా.. ఇలాంటి కామెంట్లు చూస్తుంటే సిగ్గేస్తోంది.. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎవరికేం తెలుసు.. మీరు మరో ఆత్మహత్య ఘటన జరగాలని కోరుకుంటున్నారా? అని నిలదీసింది రష్మీ.
అయితే రష్మీ వేసిన ఈ ట్వీట్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి కొట్టుకునే సీన్లు, స్క్రిప్ట్‌తోనే మీ జబర్దస్త్ షోలో చూపించేది. అక్కడేమో నవ్వుతావ్.. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావా? అంటూ రష్మీని నిలదీస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి రష్మి మాత్రం గత వారం నుంచి దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోంటోంది. అంబర్ పేట్ కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మాట్లాడటంతో సోషల్ మీడియాలో ఆమె మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది.
నాగ శౌర్య ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాలతో కలిసి పలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి.
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook