Rashmika Mandanna Hot Dress at Zee Cine Awards: కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన రష్మిక మందన అతి తక్కువ కాలంలోనే తెలుగులో కూడా హీరోయిన్ గా లాంచ్ అయింది. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో సినిమా ద్వారా టాలీవుడ్ లో లాంచ్ అయిన రష్మిక మందన అతి తక్కువ కాలంలోనే స్టార్ల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ అవుతూ రావడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ గా ముద్ర పడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆమె అనేక హిట్ సినిమాల్లో భాగమైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ వచ్చిన రష్మిక మందనకి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే ఆమె చేసిన రెండు మూడు సినిమాలు విడుదలయ్యాయి కూడా. అయితే ఆమె చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు కాకపోయినా ఆమె నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు హిందీ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


తాజాగా ముంబైలో జీ సినీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతోంది, ఈ అవార్డుల కార్యక్రమానికి రష్మిక మందన్న హాజరైయింది. అయితే ఆ వేడుకకు ఆమె ధరించిన డ్రస్సు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఎద భాగం నుంచి కేవలం తొడల పై వరకు మాత్రమే ఒక డ్రెస్ లా ధరించిన ఆమె వెనకాల మాత్రం ఒకప్పుడు రాణిలు ధరించే విధంగా ఒక మేలి ముసుగు లాంటి దాన్నీ ధరించింది.


ఆమె ఈ అవార్డుల వేదికలో కనిపించగానే అభిమానులు అందరూ కేరింతలు కొట్టారు, రెడ్ కార్పెట్ మీద ఆమె నడకకు, ఆమె డ్రస్సింగ్ స్టైల్ కు అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతానికి ఆమె నడుస్తున్న వీడియోలు అదే వేడుక మీద ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హగ్ ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ప్రస్తుతానికి హిందీ చత్రపతి రీమేక్ చేస్తున్నాడు, ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ లో హీరోగా లంచ్ అవుతున్నాడు.
Also Read: Anchor Shyamala on Ram Charan: రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?


Also Read: Suguna Sundari Dance: బాలయ్య పాటకు మెగా కోడలు డ్యాన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook