Suguna Sundari Dance: బాలయ్య పాటకు మెగా కోడలు డ్యాన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Anchor Meghana Dance for Suguna Sundari: బాలకృష్ణ పాటకు మెగా కోడలు డాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది, మెగా కోడలు మేఘన సుగుణ సుందరి చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 26, 2023, 11:02 PM IST
Suguna Sundari Dance: బాలయ్య పాటకు మెగా కోడలు డ్యాన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Mega Daughter in law Dance for Balakrishna Song: బాలకృష్ణ పాటకు మెగా కోడలు డాన్స్ చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పేరు సింహారెడ్డి సినిమా నుంచి సుగుణ సుందరి సాంగ్ ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ శ్రుతి హాసన్ మధ్య వచ్చే ఈ సాంగ్ చాలా వైరల్ అయింది. అప్పట్లో ఈ సాంగ్ కి అనేకమంది డాన్సులు కూడా వేశారు ఇప్పుడు మెగా కోడలు ఈ సాంగ్ కి డాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే మెగా కోడలు అంటే మీరు అందరూ ఉపవాసం అనుకుంటారు కానీ ఇక్కడ మెగా కోడలు ఉపాసన కాదండోయ్ యాంకర్ మేఘన. ఆమె కూడా మెగా కోడలే అన్న సంగతి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొణిదెల పవన్ తేజ్ అనే హీరో మెగాస్టార్ కుటుంబం నుంచి హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కి దూరపు బంధువు అయ్యే ఈ పవన్ తేజ్ తన మొదటి సినిమాగా ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో లాంచ్ అయ్యాడు ఆ సినిమాలో మేఘన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పవన్ తేజ్ కి మెగా కుటుంబం హీరోల సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు దొరుకుతున్నాయి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Megghanaa (@m_y_megganna)

కానీ మేఘన మాత్రం యాంకర్ గా సెటిలైంది. అయితే ఒకే సినిమాలో హీరో హీరోయిన్ గా లాంచ్ అయిన వీరిద్దరూ ఆ మధ్య ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. అలా మేఘన మెగా కుటుంబానికి కూడా ఇప్పుడు కోడలు అయిపోయింది అన్నమాట. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలోని సుగుణ సుందరి సాంగ్ కి డాన్స్ చేసి రీల్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ రీల్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా కోడలు సుగుణ సుందరి సాంగ్ కి డాన్స్ వేసింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.

Also Read: Anchor Shyamala on Ram Charan: రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్యనా? లేక ఇది జెలసీ వల్ల వచ్చిన మౌనమా?

Also Read: K Vishwanath Wife Died:కె విశ్వనాద్ ఇంట తీవ్ర విషాదం.. అదే వార్డులో ఆయన భార్య కన్నుమూత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
 

Trending News