Vijay-Rashmika: నాగశౌర్య చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రష్మిక మందన్న. ఆ తరువాత గీతాగోవిందం చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా రెండిటిలో కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఈ మధ్యనే యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన రష్మిక. తన రాబోతున్న పుష్ప సినిమా గురించే కాకుండా తనకి ఇష్టమైన సినిమా ఏది అన్న విషయం కూడా బయటపెట్టింది. ముఖ్యంగా ఒక విజయ్ దేవరకొండ ఫ్లాప్ సినిమా తనకి ఇష్టమైన సినిమా అని రష్మిక అనడంతో అదికాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఆగస్టు 15న విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి 2.0ని చూస్తారు. పుష్ప 1 చేస్తున్నప్పుడు ఎక్కువ అంచనాలు లేవు. కానీ మొదటి పార్ట్ పెద్ద హిట్ అయి పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెట్టడంతో మా పాత్రలపై కూడా మరింత బాధ్యత పెట్టింది. పార్ట్ 1 కంటే కూడా ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాము.. సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పుకొచ్చింది.


ఇక ఆ తర్వాత ఇంటర్వ్యూలో యాంకర్ రష్మిక నటించిన సినిమాలలో తనకు నచ్చిన సినిమా ఏమిటి అని ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ తన ఫేవరెట్ సినిమా అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ హీరోయిన్. ‘డియర్ కామ్రేడ్ సినిమా నా మనసుకి నచ్చిన సినిమా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా.. ఇందులోని నా పాత్రకు, నా నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. నా అభిమానులందరికి ఆ పాత్ర బాగా నచ్చింది. అందుకే డియర్ కామ్రేడ్ సినిమా నా హృదయానికి దగ్గరైంది’ అని చెప్పుకొచ్చింది రష్మిక.


అయితే విజయ్ దేవరకొండ.. రష్మిక నటించిన గీతాగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ పై అప్పట్లో ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రం మాత్రం విడుదలైన తరువాత పరాజయం చవిచూసింది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య సాగే ప్రేమ కథ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక, విజయ దేవరకొండ ఫ్లాప్ సినిమాలు తన ఫేవరెట్ సినిమా అనడంతో ఈ మాటలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.


Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..


Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది


 



 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter