రష్మిక మందన ( Rashmika Mandanna ) ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ మైలురాయిని అందుకుంది. ఈ టాలెంటెడ్ హీరోయిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ( Rashmika Mandanna Instagram followers) 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్‌లో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ క్లబ్‌లో రష్మికకు చోటు దక్కింది. 2016లో కన్నడలో కిరిక్ పార్టీ ( Kirik Party ) అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక దాదాపు ఐదేళ్లలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. Also read : Tuck Jagadish shooting: ఆగిపోయిన టక్ జగదీష్ షూటింగ్‌


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అరుదైన మైలురాయిని అందుకున్న సందర్బంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అందమైన నవ్వుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీ.. అక్కడి నుంచే తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ ధన్యావాదాలు చెప్పుకుంది.


ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సరసన చేసిన సరిలేరు నీకేవ్వరు, నితిన్‌తో చేసిన భీష్మ సినిమాలతో ( Bheeshma movie ) రష్మిక బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ ( Allu Arjun ) సరసన రష్మిక జంటగా నటిస్తోంది. Also read : Vakeel Saab shooting: వకీల్ సాబ్ షూటింగ్‌కి పవన్ కల్యాణ్ రెడీ


ఇటీవలే తమిళంలోనూ ఈ అమ్మడు తొలి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ హీరో కార్తి సరసన సుల్తాన్ ( Karthi's Sultan ) అనే సినిమాతో రష్మిక కోలీవుడ్ ఎంట్రీ ( Rashmika Mandanna's Tamil debut ) ఇస్తోంది. బక్కిరాజ్ కన్నన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌తో ఫోటో తీసుకున్న రష్మిక.. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe