Rashmika Mandanna Next Movie: అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునింది రష్మిక. ఆ తరువాత వచ్చిన యానిమల్ సినిమా సైతం మీ హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ విజయం సాధించిపెట్టింది. దీంతో తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ హీరోయిన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ డేట్స్ కోసం.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక ఒక చిన్న దర్శకత్వం సినిమా చేయాలి ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.


అసలు విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘గం గం గణేశా' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కు రష్మిక చీఫ్ గెస్ట్ గా వచ్చింది.  ఈ ఈవెంట్ లో రష్మికను ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


కాగా ఆనంద్‌ దేవరకొండ కెరియర్లో బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు. ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ సాయి రాజేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక మాట్లాడుతూ.. ‘నేను దర్శకుడు సాయి రాజేష్ గారి బేబీ సినిమా చూసాను. ఆ సినిమా చూసాక.. నేను తప్పకుండా మీతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. అలాంటి సినిమాలు తీయడం అనేది అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. మొదటిసారి బేబీ సినిమా చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఒక నటిగా ఆ సినిమా చూసాక సాయి రాజేష్ గారితో తప్పకుండా ఒక సినిమా చేయాలి, ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించింది.. మీ డైరెక్షన్ లో’ అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. 


రష్మిక ఇలా చిన్న దర్శకుడితో సినిమా చేయాలి అనడంతో.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇదీ చదవండి: తాగడానికి ఒప్పుకోలేదని దారుణం.. టెర్రస్ పై నుంచి తోసేసిన మందు బాబులు.. వీడియో వైరల్..


ఇదీ చదవండి: జూన్ 1 నుంచి బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో మారబోయే నిబంధనలు ఇవే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook