Rashmika Mandanna first look in Kubera: శేఖర్ కమ్ముల సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఈ దర్శకుడు హీరోయిన్స్ ని చూపించే తీరు. శేఖర్ కమ్ముల చిత్రం ఏదైనా సరే.. అందులో హీరోయిన్ తప్పకుండా హైలెట్గా నిలుస్తుంది. డాలర్ డ్రీమ్స్ అనే షార్ట్ ఫిలిమ్ తో సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈ దర్శకుడు.. ఆనంద్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనంద్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ సాధించి.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత వచ్చిన గోదావరి సినిమా.. ఇప్పటికీ ఎంతోమంది అభిమానించే చిత్రంగా మిగిలింది. తెలుగు సినిమాలలోనే ఈ సినిమా క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఈ రెండు చిత్రాలలో కూడా కమలని ముఖర్జీ క్యారెక్టర్.. తెలుగు ప్రేక్షకులు హీరోయిన్స్ ని చూసే తీరుని మార్చేలా చేసింది. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్స్ కి ఎంత ప్రాధాన్యత ఉండేదో.. మళ్లీ అంతటి సాంగ్ క్యారెక్టర్స్ గా తీర్చిదిద్దారు శేఖర్ కమ్ముల. 


ఆ తరువాత వచ్చిన ప్రతి సినిమాల్లో కూడా.. శేఖర్ కమ్ముల హీరోయిన్ అంటే.. ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేలా.. తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ దర్శకుడు. ఫిదా సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ కి కూడా అప్పట్లో ఎంతో మంది ఫిదా అయ్యారు. అలాంటి శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం నాగార్జున, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో కుబేర అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో సినిమాలు తీయరు. రానా, నాగచైతన్య లాంటి వారితో తీసిన.. అందులో రానాది మొదటి సినిమా కావటం.. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాలో.. సాయి పల్లవికి ఎక్కువ క్యారెక్టర్ ఇవ్వడం లాంటివి జరిగాయి. 


అయితే ధనుష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో.. ప్రేమ కథ.. కాకుండా కొంచెం డిఫరెంట్ గా.. మొదటిసారి ప్లాన్ చేశారు శేఖర్ కమ్ముల. ఈ క్రమంలో ఈ చిత్రంలో శేఖర్ కమ్ముల మార్క్ హీరోయిన్ కనిపించదేమో అనుకున్నారు అందరూ. కానీ ఈరోజు విడుదలైన రష్మిక పోస్టర్ ఆ అంచనాలను తారుమారు చేసింది. సినిమా ఎలాంటిదైనా సరే.. శేఖర్ కమ్ముల హీరోయిన్ అంటే శేఖర్ కమ్ముల హీరోయినే అన్నట్టుగా చేసింది. ఇప్పటివరకు కుబేర చిత్రం నుంచి విడుదలైన అన్ని ఫస్ట్ లుక్స్ లోకి.. ఈ ఫస్ట్ లుక్ హైలెట్ గా నిలిచింది. 


ఇక ఈ ఫస్ట్ లుక్ వీడియో విషయానికి వస్తే.. ఇందులో నిర్మాణశంగా ఉన్న అడవిలోకి వెళ్లిన ర‌ష్మిక.. అక్క‌డ గుంత‌లో పూడ్చిపెట్టిన.. ఒక నల్ల ట్రాలీ బ్యాగ్‌ను బ‌య‌ట‌కు తీస్తుంది. ఆ బ్యాగ్ మొత్తం డ‌బ్బుల‌తో నిండి ఉంది. దాన్ని చూసిన ర‌ష్మిక తెగ సంబ‌ర పడిపోతుంది. బ్యాగ్ తీసుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్‌గా మారింది. మొత్తానికి హీరోయిన్ విషయంలో ఈ సినిమాలో కూడా శేఖర్ కమ్ముల మార్క్ మిస్ అవ్వదని.. ఈ పోస్టర్ రుజువు చేసింది. 


 



Also Read: Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓజీపై అప్‌డేట్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్


Also Read: Venu Swamy: బిగ్‌బాస్‌ షోలోకి వేణుస్వామి ఫిక్స్.. షో వ్యూస్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter