Vijay Devarakonda Girl Friend:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా హిట్ అయిందంటే మాత్రం రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక కూడా తొలి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్ గా పేరు అందుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం పుష్ప 2 సినిమా సక్సెస్ తో జోష్ మీద ఉంది. ఇందులో శ్రీవల్లి గెటప్ లో చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా తన పాత్రకు 100 శాతానికి మించి న్యాయం చేసిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. 


ఇదిలా ఉండగా మరొకవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .అదే ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రానికి సంబంధించి గతంలో పోస్టర్లు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపించింది. అంతేకాదు గీతాగోవిందం లుక్కును.. మళ్ళీ తీసుకొచ్చిందని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. 


తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ రష్మిక రూమర్డ్ బాయ్.. ఫ్రెండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. టీజర్ ప్రారంభం అవ్వగానే సిటీకి వచ్చి కాలేజీలో చదువుకునే అమ్మాయి గెటప్ లో కనిపించింది రష్మిక మందన్న. ఇందులో చాలా పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది .ఇక్కడ రష్మికనీ చూస్తే మన పక్కింటి అమ్మాయి లాగే కనిపించింది. 


ఇక టీజర్ ప్రారంభం అవ్వగానే విజయ్ దేవరకొండ తన వాయిస్ తో.." నయనం నయనం కలిసే తరుణం.. యదనం పరుగే పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇకమీదట నువ్వే దానికి గమ్యం".. అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కే హైలెట్గా నిలిచింది. 


 


 



 


ఇకపోతే ఈ సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది . ఎటువంటి రొమాంటిక్ అంశాలకు చోటు ఇవ్వకుండా.. రష్మిక మందన్న యాక్టింగ్ సినిమాకి ప్లస్ గా  నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక చివరిలో రష్మిక..” ఇదేదో పిక్ అప్ లైన్ అయితే కాదు కదా.. నేను అస్సలు పడను..,” అని చెప్పే డైలాగ్.. మరోసారి రాహుల్ రవీంద్రన్ హీరోయిన్ క్యారెక్టర్ ని ఎంతో స్వచ్ఛంగా.. అంటే స్ట్రాంగ్ గా రాసారని అర్థమవుతుంది.


ఇదీ చదవండి: ఇందిరా దేవి మిస్సింగ్‌.. కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన కల్యాణ్‌, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.