Allu Arjun-Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'(Pushpa Movie). ఇది పాన్ ఇండియా సినిమాగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు(Director Sukumar). ఈ మూవీ మెుదటి పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని..డిసెంబర్ 17న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun)కు సర్ ఫ్రైజ్ కానుక పంపించింది రష్మిక. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌, ముత్త‌మ్ శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ పోలీస్‌ ఆఫీస‌ర్‌గా కనిపించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..


‘''మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్‌.. స్పెషల్‌గా ఏదైనా పంపించాలనిపించింది. అందుకే ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ మీ కోసం'' అంటూ చేతితో రాసి నోట్‌తో పాటు కొన్ని వస్తువులను బాక్స్‌లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ రష్మిక(Rashmika Mandanna)కు ధన్యవాదాలు తెలిపాడు. దీనిని బట్టి చూస్త్తే పుష్ప సినిమాలో వినియోగించిన వ‌స్తువులు ఏమైనా అల్లు అర్జున్ కు పంపించి ఉంటుందా..? అని తెగ ఆలోచిస్తున్నారు సినీ జ‌నాలు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి