Rashmika Mandanna IPL Performance రష్మిక మందాన్న మీద సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఆ ట్రోలింగ్ పట్ల కూడా రష్మిక ఇది వరకు ఎన్ని సార్లో స్పందించింది. తాను ఏం చేసినా, ఏం చేయకపోయినా కూడా ట్రోల్ చేస్తుంటారని, అయితే తాను మరి ఎలా ఉండాలో చెప్పండంటూ ట్రోలర్లకు కౌంటర్లు వేసింది. ఇక ఈ ట్రోలింగ్ తనను దాటి.. తన ఫ్యామిలీ, చెల్లి వరకు చేరిందని, అది మాత్రం తనకు బాధగా ఉందంటూ రష్మిక చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక చేసే ఫోటో షూట్లు, అందులో పెట్టే పోజులు, అప్పుడప్పుడు చేసే పిల్ల చేష్టలు ఇలా అన్నింటి మీద ట్రోలింగ్ జరుగుతుంటుంది. రష్మిక చేసే పనులు కొందరికీ క్యూట్‌గా అనిపిస్తాయి.. మరి కొందరికి చిరాకు పుట్టించేలా ఉంటాయి. అలా రష్మిక మీద ట్రోలింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రష్మిక మందాన్న ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసింది.


వారసుడు, ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు స్టేజ్ మీద రష్మిక మందాన్న డ్యాన్స్ చేసింది. అయితే ఈ డ్యాన్సులు, అందులో రష్మిక వేసిన కాస్ట్యూమ్స్ పట్ల జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పాట కోసం రిహార్సల్ చేసిన వీడియోను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆమె షేర్ చేసిన ఈ వీడియో మీద జనాలు దారుణంగా నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.


నిన్ను చూస్తుంటే చిరాగ్గా ఉంది.. అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.. విజయ్ దేవరకొండ నిన్ను ఎలా మెచ్చాడు.. రికార్డింగ్ డ్యాన్సులు వేసేదానిలా ఉందంటూ ఇలా నానా రకాలుగా రష్మిక మీద ట్రోలింగ్ చేస్తున్నారు. రష్మిక ఇప్పుడు తెలుగులో రెండు ప్రాజెక్టులను చేస్తోంది. ఈ మధ్యే కొత్త సినిమాను ప్రకటించింది. భీష్మ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తోంది. రష్మిక, నితిన్, వెంకీ కుడుముల కలిసి కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2 మాత్రమే ఉంది. తెలుగులో రష్మిక క్రేజ్ తగ్గినట్టుగా కనిపిస్తోంది.


Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే


Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook