Nithiin Rashmika : ఒక హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు.. కెరీర్ గురించి కౌంటర్లు వేసుకున్న నితిన్
Rashmika Mandanna Nithin New Project రష్మిక మందాన్న, నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. భీష్మ కరోనా కంటే ముందు వచ్చింది. కానీ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు వెంకీ కుడుముల.
Rashmika Mandanna Nithin New Project భీష్మ కాంబో మరోసారి రిపీట్ కానుంది. నితిన్, రష్మిక మందాన్న, వెంకీ కుడుముల కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేశారు. అది కూడా ఎంతో వెరైటీగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వారి మీద వారే ట్రోలింగ్ వేసుకుని ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదని, తమవి తామే తీసుకుంటున్నామని ట్రోల్స్ వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మళ్లీ ఆ హీరోయినేనా? అంటూ నితిన్ పెదవి విరుస్తాడు. ఏం ఏమైనా ప్రాబ్లమా? అని రష్మిక ఎంట్రీ ఇస్తుంది. ఈ డైరెక్టర్ ఓం రాసే కంటే ముందే స్క్రిప్ట్‌లో నీ పేరు రాస్తాడు కదా? అని వెంకీ కుడుముల మీద నితిన్ కౌంటర్లు వేస్తాడు. ఇక ఇన్ స్టాగ్రాంలో చాటింగ్, చిట్ చాట్ తప్పా ఏం చేయను.. వచ్చిన క్రేజ్‌ను అలా వాడుకుంటున్నాను అని రష్మిక చెప్పకనే చెప్పేసింది. కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేసుకుంటున్నావా? అని నితిన్ అడిగేస్తాడు.
నేను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు వస్తున్నాయ్ అని రష్మిక అంటే.. నువ్వే బెటర్.. నేను అయితే ఒక్క హిట్ ఇస్తే.. రెండు మూడు ఫ్లాపులు ఇస్తున్నా అని తన కెరీర్ మీద తానే సెటైర్లు వేసుకున్నాడు. ఇక జీవీ ప్రకాష్ ఎంట్రీ ఇచ్చి మేకప్‌తో రెడీ అవుతుంటాడు. నేను హీరోని, ఆమె హీరోయిన్ అని నితిన్ పరిచయం చేసుకుంటాడు. నేను హీరోని కాదా? అనవసరం మేకప్ కిట్ కూడా తెచ్చుకున్నానే.. మైత్రీ మూవీస్, నేషనల్ క్రష్ అని చెబితే హీరోనని అనుకున్నానే.. సినిమాకు సంగీతం ఇవ్వాలా? అంటూ జీవీ ప్రకాష్ తనని తాను ఇంట్రోడక్షన్ చేసుకున్నాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా అవుతుంది.
ఇలా హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. డైరెక్టర్ ఏంటి ఇంకా రావడం లేదు.. ఇంత లేట్ చేస్తున్నాడు అని అంటారు. భీష్మ వచ్చి మూడేళ్లు అవుతోంది.. ఇంకో స్క్రిప్ట్ అంత లేట్ చేశాడంటే.. ఇదో లెక్కనా? అన్నట్టుగా వెంకీ కుడుముల మీద కౌంటర్లు వేస్తారు. ఇలా అందరి మీద అందరూ కౌంటర్లు వేసుకుని సినిమాను భలే ప్రమోట్ చేసుకున్నారు.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook